Asianet News TeluguAsianet News Telugu

లబ్ధిపొందకపోతే చంద్రబాబుకు ఇళ్లు ఎందుకు ఇచ్చారు: లింగమనేనికి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కౌంటర్

చంద్రబాబు నాయుడు ద్వారా లబ్ధిపొందకపోతే లింగమనేని ఆ ఇంటిని ఎందుకు ఇస్తారని నిలదీశారు. జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబుతో కలిసి లింగమనేని కుట్ర పన్నుతున్నారంటూ ధ్వజమెత్తారు. 
 

ysrcp mla alla rama krishna reddy counter on lingamaneni letter
Author
Amaravathi, First Published Sep 25, 2019, 11:38 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యాపార వేత్త లింగమనేని రమేష్ లేఖ రాయడంపై మండిపడ్డారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆడించినట్లుగా లింగమనేని ఆడుతున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు లేఖ రాయమంటేనే లేఖ రాశారని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు నాయుడు ఒత్తిడితోనే లింగమనేని రమేష్ లేక రాశారని ఆర్కే ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అండదండలతో లింగమనేని రమేష్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. యజ్ఞాలు, యాగాల కోసం ఆ ఇళ్లు నిర్మించామని చెప్తున్న లింగమనేని రమేష్ గత ఏడాదిలో ఎన్ని యజ్ఞాలు ఎన్ని యాగాలు చేశారో చెప్పగలరా అని నిలదీశారు. 

చంద్రబాబు నాయుడుతో కలిసి లింగమనేని రమేష్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ద్వారా లబ్ధిపొందకపోతే లింగమనేని ఆ ఇంటిని ఎందుకు ఇస్తారని నిలదీశారు. జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబుతో కలిసి లింగమనేని కుట్ర పన్నుతున్నారంటూ ధ్వజమెత్తారు. 

లింగమనేని గెస్ట్ హౌస్ కు ఒక్క అనుమతి కూడా లేదని ఆర్కే స్పష్టం చేశారు. దానిపై లింగమనేని రమేష్ లేదా చంద్రబాబు నాయుడుతో తాను బహిరంగ చర్చకు సిద్ధమని ఆ ఇద్దరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.   

ల్యాండ్ ఫూలింగ్ లో లింగమనేని ఆస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో కుట్ర పన్నింది వాస్తవం కాదా అని నిలదీశారు. అందుకే ఆ ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని విమర్శించారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్ హెచ్ఆర్ ఏ కింద రూ.1.20 కోట్లు పొందారని ఆరోపించారు. 

ఆహెచ్ఆర్ ఏ ను లింగమనేనికి ఇచ్చారో లేదా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ లింగమనేనికి హెచ్ఆర్ఏ ఇచ్చి ఉంటే అఫిడవిట్ లో పొందుపరిచారా అంటూ నిలదీశారు. చట్టాన్ని ఇరువురు తుంగలో తొక్కి, కుట్రలు పన్నుతారా అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే ఆర్కే.  

 ఈ వార్తలు కూడా చదవండి

కృష్ణానదిపై చంద్రబాబు ఇల్లు సహా అక్రమ కట్టడాల కూల్చివేత

అనుమతితోనే నిర్మాణం.. చంద్రబాబు నివాసం పై లింగమనేని రెస్పాన్స్

ఉండవల్లి 'అద్దె' ఇంటిపై చంద్రబాబు రాద్ధాంతం ఎందుకు?

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

డ్రోన్ వినియోగంపై పోలీసులకు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ జనార్థన్ ఫిర్యాదు

వరద అంచనా కోసమే డ్రోన్ల వినియోగం, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది: మంత్రి అనిల్

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత: టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ

డ్రోన్ కెమెరా వినియోగం: చంద్రబాబు ప్రశ్నకు ఇరిగేషన్ శాఖ రిప్లై

డ్రోన్ల వెనుక కుట్ర బయటపెట్టాలి: డీజీపీకి బాబు ఫోన్

చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు

డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్

ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే

 

 

Follow Us:
Download App:
  • android
  • ios