గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీలు సంక్షోభం లుకలుకలు ప్రారంభమయ్యాయి

గుంటూరు: గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీలు సంక్షోభం లుకలుకలు ప్రారంభమయ్యాయి. పార్టీలో కొత్తగా చేరిన ఏసు రత్నంకు పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు కట్టబెట్టడంతో లేళ్ల అప్పిరెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంపై అప్పిరెడ్డి ఆశలు పెట్టుకొన్నారు. కానీ, పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జీ సమన్వయకర్తగా ఏసురత్నంకు పార్టీ బాధ్యతలను అప్పగించారు. 

దీంతో అప్పిరెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే అప్పిరెడ్డి వర్గీయులు ఆయన కార్యాలయానికి చేరుకొని పార్టీ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఓ కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పార్టీ నుండి బయలకు రావాలని డిమాండ్ చేశారు. 

అయితే ఈ విషయమై పార్టీ అధిష్టానంతో చర్చించాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఇదిలా ఉంటే రానున్న నాలుగు రోజుల్లో కార్యకర్తలతో సమాలోచనలు జరిపిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకొంటామని అప్పిరెడ్డి కార్యకర్తలకు చెప్పారు. నాలుగు రోజుల తర్వాత అప్పిరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకొంటారనేది ఆసక్తికరంగా మారింది. 

సంబంధిత వార్తలు

విజయవాడ సెంట్రల్ సీటుపై తేల్చేసిన రాధా, తొందరొద్దన్న మాజీ మంత్రి

వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాంబాబు

వైసీపీ సభ్యత్వ పుస్తకాలు దగ్ధం: అనుచరులతో వంగవీటి రాధా భేటీ

వంగవీటి రాధాకు ‌మరో షాక్: మల్లాది విష్ణు వైపే జగన్ మొగ్గు

వంగవీటి రాధా ఆగ్రహం: బుజ్జగింపులు, ఆ రోజు ఏం జరిగిందంటే...

వైసీపీలో విజయవాడ సెంట్రల్ చిచ్చు: వంగవీటి రాధాతో టచ్‌లోకి టీడీపీ?

వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు

వైసీపీలో చిచ్చు: రంగా విగ్రహం వద్ద అభిమానుల ధర్నా

వైసీపీలో చిచ్చు: ఆత్మాహత్యాయత్నం చేసిన రాధా అనుచరులు, ఉద్రిక్తత

జనసేనలోకి వంగవీటి శ్రీనివాస ప్రసాద్..