వైసీపీ నేత వంగవీటి రాధా సోదరుడు వంగవీటి శ్రనివాస ప్రసాద్.. జనసేనలో చేరనున్నారా..? అవుననే ప్రచారం ఊపందుకుంది. విజయవాడ సెంట్రల్ వైసీపీ సీటు తొలుత రాధాకి ఇస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆ సీటుని మల్లాది విష్ణుకి ప్రకటించారు. దీంతో మనస్థాపానికి గురైన శ్రీనివాస ప్రసాద్.. సోమవారం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

అయితే.. ఆయన జనసేనలో చేరనున్నట్లు ప్రచారం మొదలైంది.కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని జగన్ ప్రకటించినప్పటి నుంచి ఆయన స్తబ్దుగా ఉన్నారు. పార్టీ పెద్దల తీరు నచ్చకే రాజీనామా చేసినట్లు వంగవీటి శ్రీనివాస ప్రసాద్ వర్గీయులు చెబుతున్నారు. మల్లాది విష్ణు.. ఎప్పుడైతే వైసీపీలోకి అడుగుపెట్టారో.. అప్పటి నుంచే మనస్పర్థలు మొదలయ్యాయని, ఇక సీటు కూడా మల్లాదికే కట్టబెట్టడం రాధా వర్గీయులకు నచ్చలేదు. ఈ నేపథ్యంలోనే  .శ్రీనివాస్ పార్టీ మారి.. జనసేన తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.