విజయవాడ:విజయవాడ సెంట్రల్ సీటు విషయమై  వైసీపీలో చిచ్చురేపింది. ఈ సీటును  వంగవీటి రాధాకే కేటాయించాలంటూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.  వంగవీటి రాధా  ఆత్మహత్యాయత్నం చేసుకొనేందుకు వీలుగా పెట్రోల్ పోసుకొన్న వారిపై నీళ్లు చల్లారు.

విజయవాడ సెంట్రల్ సీటు  కాకుండా విజయవాడ తూర్పు అసెంబ్లీ సీటు లేదా మచిలీపట్నం పార్లమెంట్ సీటు నుండి పోటీ చేయాలని వైసీపీ నాయకత్వం సూచించింది.

దీంతో వంగవీటి రాధా , రంగా అభిమానులు సోమవారం నాడు వంగవీటి రంగా ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకొంది.వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు కాకుండా వేరే స్థానం కేటాయించాలని పార్టీ నాయకత్వం భావించినట్టుగా సంకేతాలు ఇవ్వడంతో రాధాతో పాటు ఆయన అనుచరులు, రంగా అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

రాధా ఇంటి వద్ద ఆయన అనుచరులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అదే సమయంలో  అక్కడికి చేరుకొన్న రాధా వారిపై నీళ్లు చల్లి  వారించారు. 

ఇదిలా ఉంటే  విజయవాడ సెంట్రల్ సీటు విషయాన్ని రాధాకు కాకుండా వేరేవాళ్లకు  కేటాయించారనే సంకేతాలు వచ్చాయనే విషయంలో వాస్తవం లేదని  యలమంచిలి రవి చెప్పారు. 

రాధాతో సమావేశమైన తర్వాత ఆయన రాధా అభిమానులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆదివారం నాడు పార్టీ సమావేశంలో ఈ విషయమై  ఎలాంటి సంకేతాలు లేవన్నారు యలమంచిలి రవి. 

ఇదిలా ఉంటే  సోమవారం సాయంత్రం ఐదుగంటలవరకు వైసీపీ నాయకత్వానికి  వంగవీటి రాధా అనుచరులు గడువు ఇచ్చారు. రంగా అభిమానులు , వంగవీటి రాధా మిత్రమండలి, విద్యార్థి విభాగం నేతలు కలిసి చర్చించనున్నారు.

ఈ వార్తలు చదవండి

వైసీపీలో చిచ్చు: రంగా విగ్రహం వద్ద అభిమానుల ధర్నా

వైసీపీలో విజయవాడ సెంట్రల్ చిచ్చు: వంగవీటి రాధాతో టచ్‌లోకి టీడీపీ?

వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు