హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడిఘటన ఇప్పటికీ చర్చనీయాంశంగానే మారింది. దాడి ఎలా జరిగిందనే విషయంపై ఇప్పటికీ బాధితుడు వైఎస్ జగన్ కానీ...పోలీసులు కానీ చెప్పడం లేదు. నిందితుడు పోలీస్ కస్టడీలో ఉన్నప్పటికీ దాడి విషయమై ఇప్పటికీ పోలీసులు ఓ కొలిక్కిరావడం లేదు.

అయితే దాడిపై మాత్రం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారం రేపుతోంది. జగన్ ను హతమార్చేందుకు టీడీపీ కుట్రలో భాగంగానే దాడి జరిగిందని వైసీపీ ఆరోపిస్తుంటే జగన్ కావాలనే తనపై దాడి చేయించుకుని కోడికత్తి డ్రామాలు ఆడుతుందని టీడీపీ ఆరోపిస్తుంది.  

అయితే దాడికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు పెదవి విప్పుతారా అని సర్వం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎప్పుడు ఈ టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధానికి ఫుల్ స్టాప్ పెడతారా అంటూ యావత్ తెలుగు రాష్ట్రాలు గమనిస్తున్నాయి. 

పోలీసులకు సైతం వాంగ్మూలం ఇవ్వని జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. వైద్యుల సూచన మేరకు నవంబర్ 2 వరకు జగన్ పాదయాత్రన విరామం ప్రకటించారు. నవంబర్ 3నుంచి మళ్లీ విజయనగరంలో పాదయాత్ర చేపట్టబోతున్నారు. 

అయితే నవంబర్ 6న విజయనగరం జిల్లా పార్వతీపురంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు వైసీపీ శ్రేణులు సన్నాహాకాలు చేస్తున్నారు. నవంబర్ 6న జగన్ బహిరంగ సభలో దాడికి సంబంధించిన వివరాలను ప్రజలకు వివరించనున్నట్లు సమాచారం. దాడి తర్వాత జరిగిన పరిణామాలు, టీడీపీ శ్రేణుల విమర్శలను ప్రజలసాక్షిగా తిప్పికొట్టేందుకు జగన్ వ్యూహ రచన చేస్తున్నారు. 

ఇకపోతే దిపావళి సందర్భంగా నవంబర్ 7, 8,9, తేదీలలో పాదయాత్రకు జగన్ విరామం ప్రకటించారు. మళ్లీ 10న జగన్ పాదయాత్ర చేపట్టనున్నారు. నవంబర్ 17న శ్రీకాకుళం జిల్లాలోకి పాదయాత్ర చేరుకోనుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్