విజయవాడ:భర్తకు మళ్లీ దగ్గరయ్యేందుకు బ్యూటీషీయన్ పద్మ ప్రయత్నిస్తున్నందుకే  ప్రియుడు నూతన్ కుమార్ ఆమెపై హత్యాయత్నానికి పాల్పడినట్టుగా పోలీసులు  అనుమానిస్తున్నారు. భార్యను వదిలేసి ఆస్తిని పోగోట్టుకొని వచ్చినా కూడ తనను కాదని  భర్త దగ్గరకు వెళ్లేందుకు పద్మ ప్రయత్నిస్తుండడంతోనే నూతన్ కుమార్ ఆమెపై హత్యాయత్నానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

ఆగష్టు 24 వ తేదీన కృష్ణా జిల్లా బాపులపాడులో  బ్యూటీషీయన్ పద్మపై చిత్రహింసలకు గురై ప్రాణాపాయస్థితిలో ఉండగా ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పద్మ ప్రియుడు నూతన్‌కుమార్ ఈ దారుణానికి పాల్పడినట్టుగా  పోలీసులు నిర్ధారించారు. 

అయితే  పద్మపై హత్యాయత్నానికి పాల్పడిన ఆమె ప్రియుడు నూతన్ కుమార్ ఆగష్టు 26 వ తేదీన  సాయంత్రం గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం నుదురుపాడు వద్ద రైల్వే పైవంతెన వద్ద శవంగా తేలాడు. 

బ్యూటీషీయన్ పద్మపై హత్యాయత్నానికి పాల్పడిన ఆమె ప్రియుడు నూతన్ కుమార్ తన బైక్‌పై హైద్రాబాద్‌కు పారిపోయినట్టుగా తొలుత పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు నూతన్‌కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీస్ బృందం హైద్రాబాద్‌కు బయలుదేరిన విషయం మీడియా ద్వారా తెలుసుకొన్న నూతన్ కుమార్ తిరిగి గుంటూరుకు వచ్చి సూసైడ్ చేసుకొన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఏలూరులోని మోటార్ బైక్ షోరూమ్ లో  పద్మ పనిచేసే సమయంలో నూతన్ కుమార్ తో పరిచయం ఏర్పడింది.  ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.దీంతో భార్యను వదిలేసి పద్మతో నూతన్ కుమార్ సహజీవనం చేస్తున్నాడు. నాలుగేళ్లుగా  వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. అయితే పద్మ ఇద్దరూ కూతుళ్లకు యుక్త వయస్సు వచ్చింది. దీంతో నూతన్ కుమార్ తో  సంబంధాన్ని తెంచుకోవాలని ఆమె భావించింది.

ఈ బంధం తమ కూతుళ్ల భవిష్యత్‌‌పై  పడుతోందని  పద్మ భావించింది. అదే క్రమంలో భర్తకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.ఈ విషయమై నూతన్ కుమార్ ‌పై  పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ విషయమై ఏడాది కాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మరో వైపు పద్మపై దాడికి ఒక్క రోజు ముందు కూడ  వీరిద్దరూ కూడ  గొడవకు దిగినట్టు సమాచారం. 

ప్రియురాలు పద్మ దూరమయ్యేందుకు ప్రయత్నించడం , ఆస్తి కరిగిపోవడంతో నూతన్ కుమార్ తట్టుకోలేకపోయాడు. దీంతో ఆమెపై హత్యాయత్నానికి ప్రయత్నించాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 

ఈ వార్తలు చదవండి

బ్యూటీషీయన్ కేసు: పద్మపై నూతన్ కుమార్ భార్య సంచలనం

బ్యూటీషీయన్ పద్మ కేసు: నుదిటిపై ఎస్ అక్షరం వెనుక నూతన్

బ్యూటీషీయన్ పద్మ కేసు: నూతన్‌కుమార్‌‌ చరిత్ర ఇదీ

బ్యూటీషీయన్ పద్మ కేసులో ట్విస్ట్: ప్రియుడు నూతన్ సూసైడ్

బ్యూటీషీయన్ పద్మపై దాడి: సుబ్బయ్య ఎవరు? ఆరా తీస్తున్న పోలీసులు

అఫైర్: కాళ్లూ చేతులూ కట్టేసి బ్యుటిషియన్ పై దాడి