బ్యూటీషీయన్ పద్మ కేసులో ట్విస్ట్: ప్రియుడు నూతన్ సూసైడ్

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 26, Aug 2018, 6:30 PM IST
beautician padma lover commits suicide in narasaraopet
Highlights

 బ్యూటీషీయన్ పద్మను చిత్రహింసలు పెట్టినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు నూతన్ కుమార్ ఆదివారం సాయంత్రం నరసరావుపేట వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 

గుంటూరు: బ్యూటీషీయన్ పద్మను చిత్రహింసలు పెట్టినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు నూతన్ కుమార్ ఆదివారం సాయంత్రం నరసరావుపేట వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా బాపులపాడులో తన ప్రియురాలు పద్మపై నూతన్ కుమార్ చిత్ర హింసలు పెట్టాడు.నూతన్ కుమార్ ఆమెను వివస్త్రను చేసి కత్తితో తీవ్రంగా గాయపర్చాడు.

కాళ్లు, చేతులు కట్టేసి ఆమె శరీరంగా కత్తితో గాయపర్చాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం నుండి నూతన్  కుమార్ ఆచూకీ లభించడం లేదు. పద్మకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి దాడికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.

అయితే ఈ ఘటన జరిగిన నాటి నుండి నూతన్ కుమార్ ఆచూకీ లభ్యం కాలేదు. అయితే నూతన్ కుమార్ మాత్రం నర్సరావుపేటలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కేసు భయంతోనే నూతన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.నూతన్ కుమార్ మృతి చెందినట్టు హనుమాన్ జంక్షన్ పోలీసులు నిర్ధారించారు.

ఈ వార్తలు చదవండి

బ్యూటీషీయన్ పద్మపై దాడి: సుబ్బయ్య ఎవరు? ఆరా తీస్తున్న పోలీసులు

బ్యూటీషీయన్‌పై దాడి: మత్తు ఇంజక్షన్ ఇచ్చి కత్తి గాట్లు, ప్రియుడెక్కడ?

అఫైర్: కాళ్లూ చేతులూ కట్టేసి బ్యుటిషియన్ పై దాడి

loader