విజయవాడ: బ్యూటీషీయన్ పద్మపై దాడి కేసులో నూతన్ కుమార్‌తో పాటు సుబ్బయ్య అనే వ్యక్తి పేరు కూడ ప్రచారంలోకి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్మ ఈ మేరకు పోలీసులకు సుబ్బయ్య పేరు కూడ చెప్పినట్టు సమాచారం.

బ్యూటీషీయన్ పద్మ శరీరంపై తీవ్ర గాయాలతో ఉండగా భర్త ఆసుపత్రిలో చేర్పించాడు. భర్తతో విడిపోయి నూతన్ కుమార్ తో ఆమె సహాజీవనం చేస్తోంది. అయితే గురువారం నాడు పద్మతో ఆమె ప్రియుడు నూతన్ కుమార్ గొడవ పెట్టుకొన్నాడని స్థానికులు చెబుతున్నారు.

ఈ విషయాన్ని పద్మ తన పెద్ద కూతురుకు ఫోన్ లో చెప్పింది. అయితే శుక్రవారం నాడు పద్మపై దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు పద్మ ఇంటి వద్ద నూతన్ స్కూటర్ ఉంది.  పద్మ ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉంది. నూతన్ కుమార్ కూడ స్విచ్చాఫ్ చేసి ఉంది.

అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్మ నూతన్ కుమార్ తో పాటు సుబ్బయ్య అనే వ్యక్తి పేరును కూడ చెప్పినట్టు సమాచారం. అయితే సుబ్బయ్యకు, నూతన్ కుమార్ కు, పద్మకు మధ్య ఉన్న సంబంధం ఏమిటీ అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. సుబ్బయ్య ఎవరనే విషయాన్ని కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

అయితే పద్మ పూర్తిగా కోలుకొంటే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేకపోలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే నూతన్ కుమార్ కు, పద్మకు ఎందుకు గొడవ జరిగిందనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ వార్తలు చదవండి

బ్యూటీషీయన్‌పై దాడి: మత్తు ఇంజక్షన్ ఇచ్చి కత్తి గాట్లు, ప్రియుడెక్కడ?

అఫైర్: కాళ్లూ చేతులూ కట్టేసి బ్యుటిషియన్ పై దాడి