బ్యూటీషీయన్ పద్మ కేసు: నుదిటిపై ఎస్ అక్షరం వెనుక నూతన్

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 27, Aug 2018, 12:51 PM IST
beautician padma case:  the secret of S symbol on padma's forehead
Highlights

బ్యూటీషీయన్ పద్మ నుదిటిపై  ఎస్ అక్షరాన్ని కత్తితో  రాసింది ఆమె ప్రియుడు నూతన్ కుమారేనని  పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగిన సమయంలో  పద్మ తన చేతిపై  'ఎన్' అక్షరాన్ని పచ్చబొట్టు(టాటూ)గా వేయించుకొంది

విజయవాడ: బ్యూటీషీయన్ పద్మ నుదిటిపై  ఎస్ అక్షరాన్ని కత్తితో  రాసింది ఆమె ప్రియుడు నూతన్ కుమారేనని  పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగిన సమయంలో  పద్మ తన చేతిపై  'ఎన్' అక్షరాన్ని పచ్చబొట్టు(టాటూ)గా వేయించుకొంది.  పద్మ చేతిపై ఉన్న టాటూను  నూతన్ కుమార్ కత్తితో చెరిపేశాడు.

ఆగష్టు  24 వ తేదీన బాపులపాడులో ఉంటున్న పద్మ ఇంట్లోనే  ఆమెను వివస్త్రను చేసి  ఆమె శరీరంపై కత్తితో  నూతన్ కుమార్  గాట్లు పెట్టాడు. వీపుపై కూడ  తీవ్రమైన గాయాలున్నట్టుగా వైద్యులు గుర్తించాడు.  తమ మధ్య చిగురించిన ప్రేమకు గుర్తుగా పద్మ తన చేతిపై  ఎన్ అనే అక్షరాన్ని పచ్చబొట్టుగా వేయించుకొంది.

నూతన్ పేరుకు గుర్తుగా పద్మ తన చేతిపై ఎన్ అనే అక్షరాన్ని వేయించుకొంది. అయితే గత ఏడాదిగా వీరిద్దరి మధ్య గొడవలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే  ఆగష్టు 24 వ తేదీన పద్మను నూతన్ కుమార్  చంపేందుకు చిత్రహింసలకు గురిచేశాడని  పోలీసులు చెబుతున్నారు. తన పేరును పద్మ చేతిపై ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఎన్ అనే అక్షరం ఉన్న ప్రాంతాన్ని కత్తితో నరికేశాడు.

అంతేకాదు  పద్మ నుదిటిపై ఎస్ అనే అక్షరాన్ని కత్తితో గాటు పెట్టాడు. పద్మ భర్త పేరు సూర్యనారాయణ. పద్మపై హత్యాయత్నం చేసింది ఆమె భర్త సూర్యనారాయణ అనే అనుమానం వచ్చేలా నూతన్ కుమార్  ఆమె నుదిటిపై  ఎస్ అనే అక్షరాన్ని కత్తితో చెక్కి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  మొత్తంగా  ఈ విషయంలో పోలీసులు  ఈ కేసులో  నూతన్ కుమార్ స్నేహితుడు సుబ్బయ్యను కూడ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.

అయితే ఈ కేసులో తన ప్రమేయం లేదని  సుబ్బయ్య పోలీసులకు తేల్చి చెప్పాడు. సుబ్బయ్య చెప్పిన విషయాలను నిర్ధారించుకొన్న తర్వాత పోలీసులు అతడిని వదిలేశారని సమాచారం.

ఈ వార్తలు చదవండి

బ్యూటీషీయన్ పద్మ కేసు: నూతన్‌కుమార్‌‌ చరిత్ర ఇదీ

బ్యూటీషీయన్ పద్మ కేసులో ట్విస్ట్: ప్రియుడు నూతన్ సూసైడ్

బ్యూటీషీయన్ పద్మపై దాడి: సుబ్బయ్య ఎవరు? ఆరా తీస్తున్న పోలీసులు

బ్యూటీషీయన్‌పై దాడి: మత్తు ఇంజక్షన్ ఇచ్చి కత్తి గాట్లు, ప్రియుడెక్కడ?

అఫైర్: కాళ్లూ చేతులూ కట్టేసి బ్యుటిషియన్ పై దాడి

loader