విజయవాడ: వివాహేతర సంబంధాన్ని వద్దని పద్మ తెగేసీ చెప్పినందుకే ఆమెపై నూతన్ కుమార్ దాడికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నూతన్ కుమార్  అనుమానాస్పద మృతిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడులో బ్యూటీషీయన్ పద్మను చిత్రహింసలకు గురిచేసిన నూతన్‌కుమార్‌ పలువురు మహిళలతో సంబంధాలను పెట్టుకొన్నాడని  పోలీసుల విచారణలో తేలింది.

బ్యూటీషీయన్ పద్మపై నాలుగు రోజుల క్రితం బాపులపాడులోని ఇంట్లో నూతన్ కుమార్  అత్యంత పాశవికంగా  చిత్రహింసలకు గురిచేశాడు.   పద్మను వివస్త్రను చేసి ఆమె శరీరంపై కత్తితో గాట్లు పెట్టాడు.  

 బ్యూటీషీయన్  తీవ్ర గాయాలతో కొన ఊపిరితో  ఉన్న పద్మను  ఆసుపత్రిలో చేర్పించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో  సుబ్బయ్య అనే పేరును కూడ పద్మ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. నూతన్ కుమార్ తో పాటు సుబ్బయ్య కూడ  పద్మను చిత్రహింసలకు గురిచేసిన  వ్యవహరంలో ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

బ్యూటీషీయన్‌ పద్మను చిత్రహింసలకు గురిచేసిన నూతన్ కుమార్  శుక్రవారం నుండి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆదివారం సాయంత్రం నూతన్ కుమార్ గుంటూరు జిల్లా నర్సరావుపేట సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  మృతదేహాన్ని చూసిన నూతన్ కుమార్ భార్య ధృవీకరించారు.

బ్యూటీషీయన్ పద్మతో పాటు మరికొందరు మహిళలను కూడ  నూతన్ కుమార్ తన ట్రాప్‌లో వేసుకొన్నాడని  పోలీసుల విచారణలో తేలింది.  గతంలో ఏలూరులో బ్యూటీషీయన్‌తో కూడ నూతన్ కూడ సంబంధం పెట్టుకొన్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ సమయంలో  ఆమె భర్తపై బ్యూటీషీయన్‌తో కేసు పెట్టించడంలో  నూతన్ కుమార్ కీలకంగా వ్యవహరించాడని అప్పట్లో ప్రచారం సాగినట్టుగా స్థానికులు చెబుతున్నారు.

నూతన్ కుమార్ ఓ షోరూమ్‌లో పనిచేసే సమీపంలో  మేనేజర్‌గా పనిచేసే సమయంలో  పద్మతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే  నూతన్ కుమార్ తో బ్యూటీషీయన్ పద్మకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం  వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం పద్మ భర్త సూర్యనారాయణకు తెలిసింది.  దీంతో భార్య, భర్తల మధ్య విబేధాలు వచ్చాయి.

భర్త సూర్యనారాయణపై కూడ ఆమె కేసు పెట్టింది. ఆ తర్వాత పద్మ రాజీ పడింది. పెద్ద కూతురు భర్త సూర్యనారాయణ వద్ద, చిన్న కూతురు తన తల్లి వద్ద ఉంటున్నారు. అయితే కృష్ణా జిల్లా బాపులపాడు వద్ద  ఈ నెల మొదటివారంలో  నూతన్ కుమార్, పద్మ ఓ ఇల్లు తీసుకొని  సహజీవనం చేస్తున్నారు. అయితే ఆగష్టు 24 వ తేదీన  నూతన్ కుమార్, పద్మకు మధ్య గొడవలు జరిగాయి. శుక్రవారం నాడు ఆమె తీవ్ర గాయాలతో  ఇంట్లోనే అపస్మారక స్థితిలో ఉండగా ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.

నూతన కుమార్‌ది ఏలూరులోని వెన్నవెల్లివారి పేట. తండ్రి ఆర్మీ ఉద్యోగి, తల్లి వీడీవో ఇద్దరూ లేరు. చెల్లి, అన్నయ్య ఉన్నారు. తల్లి అనారోగ్యానికి గురైనపుడు అన్ననుమోసం చేసి ఉమ్మడిగా ఉన్న ఇంటిని తనపేరున రాయించుకొన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ స్థలాన్ని రెండు సంవత్సరాల క్రితం అమ్మ గా వచ్చిన రూ.36లక్షల్లో కొంత సొమ్ము స్నేహితులకు వడ్డీలకు ఇచ్చాడు.

ఈ వార్తలు చదవండి

బ్యూటీషీయన్ పద్మ కేసులో ట్విస్ట్: ప్రియుడు నూతన్ సూసైడ్

బ్యూటీషీయన్ పద్మపై దాడి: సుబ్బయ్య ఎవరు? ఆరా తీస్తున్న పోలీసులు

బ్యూటీషీయన్‌పై దాడి: మత్తు ఇంజక్షన్ ఇచ్చి కత్తి గాట్లు, ప్రియుడెక్కడ?