అఫైర్: కాళ్లూ చేతులూ కట్టేసి బ్యుటిషియన్ పై దాడి

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 25, Aug 2018, 10:44 AM IST
Murder Attempt On Beautician Padma At Hanuman Junction
Highlights


విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితను తాళ్లతో కాళ్లు చేతులు కట్టేసి, ఊపిరాడకుండా ముఖంకు కవర్ తొడిగి  కత్తితో అత్యంత పాశవికంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన కృష్ణా జిల్లా ఉంగుటూరులో చోటు చేసుకుంది. 

విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితను తాళ్లతో కాళ్లు చేతులు కట్టేసి, ఊపిరాడకుండా ముఖంకు కవర్ తొడిగి  కత్తితో అత్యంత పాశవికంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన కృష్ణా జిల్లా ఉంగుటూరులో చోటు చేసుకుంది. 

గన్నవరం సమీపంలోని బాపులపాడుకు చెందిన పల్లి పద్మ ఉంగుటూరులో వైష్ణవి బ్యూటీ పార్లర్ ను నిర్వహిస్తోంది. ఈమెకు సూర్యనారాయణ ప్రసాద్ అనే వ్యక్తితో వివాహమైంది. వివాహం అయిన తర్వాత భర్తతో విభేదాలు రావడంతో కుమార్ అనే యువకుడితో సహజీవనం చేస్తుంది. కుమార్ పశ్చిమగోదావరి  జిల్లా ఏలూరులో ఓ బ్యాంకులో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 

 

అయితే  ఉంగుటూరులో నివాసముంటున్న పద్మ రెండు రోజులుగా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా పద్మ రక్తపు మడుగులు అపస్మారక స్థితిలో ఉంది. దీంతో స్థానికులు హనుమాన్ జంక్షన్ పోలీసులకు సమాచారం అందించారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పద్మను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దాడి రెండు రోజుల క్రితం జరిగినట్లు నిర్ధారించారు. వివాహేతర సంబంధమే దాడికి కారణంగా అనుమానిస్తున్నారు. భర్త ప్రసాద్ దాడికి పాల్పడ్డాడా...లేదా సహజీవనం చేస్తున్నకుమార్ దాడికి పాల్పడ్డాడా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో దాడికి పాల్పడిన కత్తి, బ్యాట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

భార్యపై కోపంతో మూడేళ్ల కూతురిని....

నెల్లూరులో వివాహిత అనుమానాస్పద మృతి....కండోమ్, వీర్యం ఆధారంగా విచారణ

loader