నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘పెథాయ్’’ తుఫాను ఏపీ తీరంవైపు వడివడిగా దూసుకోస్తోంది. గంటకు 19 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ కోస్తాంధ్రాలో బీభత్సం సృష్టించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఇది కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం తుని-యానాం మధ్య ‘‘పెథాయ్’’ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు.
పెథాయ్ ప్రభావంతో తూర్పు, పశ్చిమ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కోస్తాపై విరుచుకుపడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తుఫాను తీరం దాటే వరకు సాధ్యమైనంతలో జనం ఇళ్లలోంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ప్రధానంగా ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
పెథాయ్ తుఫాన్: సముద్రంలో అల్లకల్లోలం
పెథాయ్ తుఫాన్: తెలంగాణపై ఎఫెక్ట్
పెథాయ్ తుఫాన్: అధికారులను అలెర్ట్ చేసిన బాబు
దిశ మార్చుకొంటున్న పెథాయ్: భారీ వర్షాలు
ఏపీపై మొదలైన పెథాయ్ ప్రభావం... తీరంలో హై అలర్ట్
తుఫానుకు ‘‘పెథాయ్’’ అన్న పేరు వెనుక..?