AP weather update: జూన్ 8న ఆలస్యంగా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు అప్పటి నుంచి భారత ప్రధాన భూభాగంపై పురోగమించడం ప్రారంభించాయి. దీని పశ్చిమ ప్ర‌వేశం క్రమంగా దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోని ఎక్కువ ప్రాంతాలను కవర్ చేస్తుండగా, తూర్పు ప్ర‌భావం ఈశాన్య వైపు నుండి దేశంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంద‌ని ఐఎండీ తెలిపింది. 

Monsoon to arrive Rayalaseema in two days: రెండు రోజుల క్రితం కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు గత 24 గంటల్లో వేగం పెరగడంతో రాయలసీమను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు సాధారణంగా కేరళ నుండి ఆంధ్ర ప్రాంతానికి చేరుకోవడానికి 4 రోజులు పడుతుంది. ఇప్పుడు ఒకరోజు ముందుగా అంటే ఆదివారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావ‌ర‌ణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల‌కు మో మూడు నాలుగు రోజుల్లో రుతుప‌వ‌నాలు విస్త‌రిస్తాయ‌ని పేర్కొంటున్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుఫాను ప్రభావంతో బంగాళాఖాతంలో శ్రీలంక దిగువ ప్రాంతం నుంచి నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. 3 రోజుల్లోనే పైకి వచ్చి శుక్రవారం తమిళనాడు, కర్ణాటకలకు విస్తరించింది. మరో రెండు రోజుల్లో ఇది ఆంధ్రాకు వచ్చే అవకాశం ఉందని ఇదివ‌ర‌కు ఐఎండీ తెలిపింది. 

మరోవైపు రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి పూర్తిగా వ్యాపించే వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని ప్రాంతీయ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. రోహిణి కార్తె త‌ర్వాత మృగశిర కార్తెతో వాతావరణం చల్లబడింది. అయితే, ప్రస్తుతం వ‌ర్షాలు కురుస్తున్న పరిస్థితి లేదు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో శుక్రవారం 43-45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా కృష్ణా, గుంటూరు తీరాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ‌నివారం కూడా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి ప‌రిస్థితి వుంటుంద‌ని తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌లు ప్రాంతాల‌ను ఆదివారం రుతుప‌వ‌నాలు తాకుతాయ‌ని ఐఎండీ పేర్కొంది. 

ఇదిలావుండ‌గా, జూన్ 8న ఆలస్యంగా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు అప్పటి నుంచి భారత ప్రధాన భూభాగంపై పురోగమించడం ప్రారంభించాయి. దీని పశ్చిమ ప్ర‌వేశం క్రమంగా దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోని ఎక్కువ ప్రాంతాలను కవర్ చేస్తుండగా, తూర్పు ప్ర‌భావం ఈశాన్య వైపు నుండి దేశంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంద‌ని ఐఎండీ తెలిపింది. రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా అంచనాలు వెల్ల‌డించాయి.