Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. అప్పు అడిగితే.. వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్, ఇద్దరి అరెస్ట్..

వివాహితను బెదిరించి న్యూడ్ వీడియో కాల్ చేయించి.. దాన్ని రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 

two held for blackmailing married woman by recording nude video call in andhra pradesh
Author
Hyderabad, First Published Aug 18, 2022, 9:22 AM IST

అమరావతి : మహిళలను భయపెట్టో.. ప్రలోభపెట్టో నగ్నంగా వీడియో కాల్ చేసేలా ఒత్తిడి తెచ్చి.. దాన్ని రికార్డు చేసి, వారిని బెదిరించి లొంగ తీసుకుంటున్నారు పలువురు మోసగాళ్లు. కృష్ణా జిల్లాలో మూడు వారాల వ్యవధిలో ఇలాంటి కేసులు రెండు నమోదు కావడం గమనార్హం.  గత నెలలో కృష్ణా జిల్లా గూడూరు మండలానికి చెందిన డిగ్రీ విద్యార్థిని ఓ మోసగాడి వలలో చిక్కి, నగ్నంగా వీడియో కాల్ చేసి చిక్కుల్లో పడింది. వేధింపులు తాళలేక చివరికి పోలీసులను ఆశ్రయించింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వివాహిత నగ్న వీడియో కాల్ రికార్డు చేసి, బెదిరించిన కేసులో ఇద్దరు నిందితులు కటకటాల పాలయ్యారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. రాజమహేంద్రవరానికి చెందిన ఓ వివాహిత భర్తతో విడిపోయి పిల్లలతో వేరుగా ఉంటోంది. బతుకుతెరువు కోసం దుకాణం నడుపుకుంటోంది. వ్యాపార అవసరాల కోసం రాజమహేంద్రవరానికి చెందిన హన్సకుమార్ జైన్  అనే  వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకునేది. ఇటీవల ఆమె అప్పు అడగగా ఎక్కువ వడ్డీ అవుతోందని.. ఇష్టమైతేనే తీసుకోవాలని.. లేని పక్షంలో నగ్నంగా తనకు వీడియో కాల్ చేయాలని, గెస్ట్ హౌస్ కు రావాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. గత్యంతరం లేక ఆమె నగ్నంగా వీడియో కాల్ చేసింది.

పౌరులూ యాప్ సిద్ధం చేస్తారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారో ట్రాక్ చేస్తారు.. పవన్ కల్యాణ్..

దీనిని హన్స కుమార్ స్క్రీన్ రికార్డు సాయంతో తన సెల్ లో రికార్డు చేశాడు. దీన్ని విజయవాడ కానూరులో ఉంటున్న అతని బంధువు చందు చూసి…  తన ఫోన్, లాప్టాప్ లలోకి కాపీ చేసుకున్నాడు. వీటిని పోర్న్ సైట్స్ లోకి అప్లోడ్ చేసి, వాటి లింక్ ను బంధువులకు పంపిస్తానని చందు ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. వీడియో తాలూకు స్క్రీన్ షాట్ తీసి బాధితురాలితో పాటు తన వ్యాపార భాగస్వామికి కూడా పంపించాడు.  వేధింపులు ఎక్కువవడంతో ఆమె మచిలీపట్నంలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ కేసును మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. కర్నూలుకు చెందిన చందు, రాజమండ్రికి చెందిన వడ్డీ వ్యాపారి హన్సకుమార్ జైన్ ను అరెస్టు చేశారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే నిరుడు డిసెంబర్ లో ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్ లో జరిగింది. భర్తకు తెలియండంతో విస్తుపోయే కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య, ప్రియుడికి నగ్నంగా వీడియో కాల్స్ చేస్తోందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య తన ప్రేమికుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో భర్త ఇంట్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. దాన్ని తన ఫోన్ కు కనెక్ట్ చేసుకున్నాడు.

ఈ క్రమంలో భార్య.. ఢిల్లీలో ఉండే ప్రియుడి కోసం నగ్న వీడియో కాల్ కూడా రికార్డు చేసిందని ఆరోపించాడు. అలాగే తన కుమార్తె నగ్న వీడియోను కూడా రికార్డు చేసిందని కవిసాగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వీటికి సంబంధించిన ఫుటేజీని పోలీసులకు అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios