Asianet News TeluguAsianet News Telugu

రాజమండ్రి అత్యాచార బాధితురాలిని దత్తత తీసుకుంటున్నాం: చంద్రబాబు

రాజమండ్రిలో కొందరు మృగాల చేతిలో అతి దారుణంగా అత్యాచారానికి గురయిన దళిత మైనర్ బాలికకు అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. 

TDP Helps rajahmundry gang rape victim
Author
Guntur, First Published Jul 23, 2020, 1:14 PM IST

గుంటూరు: రాజమండ్రిలో కొందరు మృగాల చేతిలో అతి దారుణంగా అత్యాచారానికి గురయిన దళిత మైనర్ బాలికకు అండగా నిలిచింది ప్రతిపక్ష తెలుగుదేశం. పార్టీ తరపున బాలికను దత్తత చేసుకుని చదివించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అంతేకాకుండా తక్షణ సాయం కింద బాలికకు   రూ.2లక్షల ఆర్ధిక సాయం అందించనున్నట్లు తెలిపారు. 

రాజమండ్రిలో దళిత మైనర్ బాలిక(16)పై జరిగిన సామూహిక అత్యాచారం పూర్వాపరాలపై టిడిపి ఏర్పాటుచేసిన నిజనిర్దారణ కమిటి తమ నివేదికను చంద్రబాబుకు అందించింది. టిడిపి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కూడిన ప్రతినిధి బృందం బుధవారం రాజమండ్రి సందర్శించి బాధితురాలిని పరామర్శించిన వివరాలను సేకరించిన విషయం తెలిసిందే. 

read more  రాజమండ్రిలో సెల్స్ గర్ల్ పై సామూహిక అత్యాచారం...వారిపనేనా?: పవన్ కల్యాణ్

ఈ క్రమంలో బాధితురాలి పరిస్థితి గురించి టిడిపి ప్రతినిధుల బృందం వివరించగానే చంద్రబాబు చలించి పోయారట. దీంతో వెంటనే బాధితురాలికి పార్టీ తరపున రూ.2లక్షల ఆర్ధికసాయం అందించాలని పార్టీ నాయకులను ఆదేశించారు.  దళిత బాలిక పదో తరగతి దాకా చదువుకుందని పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు, ఆమెను పార్టీ తరఫున దత్తత చేసుకుని చదివించే బాధ్యతను టిడిపి తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

బాధితురాలిలో ఆత్మవిశ్వాసం కలిగించాలని,  టిడిపి అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని చంద్రబాబు నాయకులను కోరారు. ఇటువంటి దుర్మార్గాలపై పోరాడే యోధురాలిలా ఆమెను తీర్చిదిద్దాల్సిన బాధ్యత సమాజంపైనే ఉందన్నారు.

 ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోరుకొండ మండలం మధురపూడికి చెందిన బాలికకు వరుసకు అక్క అయ్యే మచ్చా అనిత దుర్మార్గానికి కారణం. బాలిక తల్లి అభ్యర్థన మేరకు రాజమహేంద్రవరంలోని ఓ వస్త్ర దుకాణంలో బాలికను అనిత పనికి పెట్టింది. గత నెల 22వ తేదీన అనిత మరో ఐదుగురు యువకులతో కుట్ర చేసింది. దుకాణానికని చెప్పి బాలికను ఆటోలో ఎక్కించుకుని తీసుకుని వెళ్లింది. 

చివరకు బాలికను రంపచోడవరం తీసుకుని వెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేశారు. వారి బెదరింపులకు భయపడి బాధితురాలు విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత బాలిక అనారోగ్యానికి గురైంది. దాంతో తల్లి ఆమెను బయటకు రానివ్వలేదు. ఈ నెల 12వ తేదీన అనిత, మరికొంత మంది బాలిక ఇంటికి వెళ్లి బెదిరించి బెదిరించి ఆటోలో తీసుకుని వెళ్లారు. బాలికపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఆ తర్వాత బాలికను బంధించి చిత్రహింసలు పెట్టారు. కూతురు ఇంటికి రాకపోవడంతో బాలికక ల్లి కోరుకొండ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలియడంతో నిందితులు బాలికను వదిలేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను రాజమహేంద్రవరం ప్రబుత్వాస్పత్రికి తరలించారు.

తనపై అత్యాచారం చేసినట్లు బాలిక వాంగ్మూలం ఇచ్చింది. నిందితులు మచ్చా అనిత, ముప్పా శివ, సాయి, దువ్వాడ శివకుమార్, విజయకుమార్, రాజాలా వెంకటదుర్గ, కొత్తపల్లి గౌరీశంకర్, ఉండ్రాజపురం రవితేజ, కె. సత్యశివ వరప్రసాద్, డాని, చిన్ని, కసిరెడ్డి లావణ్యలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షిముషి బాజ్ పాయి వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios