బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆదివారం ఉదయం ఢిల్లీ చేరుకున్న బాబు... జైట్లీ నివాసంలో ఆయన భౌతికకాయానికి పులమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జైట్లీతో తనకు 25 ఏళ్ల నుంచి అనుబంధం ఉందని.. పార్టీలకతీతంగా అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. విద్యార్ధి నేత నుంచి అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర ఆర్ధిక మంత్రి స్థాయికి చేరుకున్నారని చంద్రబాబు కొనియాడారు.

ఆర్ధిక, న్యాయశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని బాబు గుర్తు చేశారు. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ కోసం ఎంతో చేశారని... భారతదేశం ఒకే సంస్కరణవాదిని, మేధావిని, గొప్ప మానవతావాదిని కోల్పోయిందని జైట్లీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు బాబు పేర్కొన్నారు.

ఏపీ విభజన సందర్భంగా హైదరాబాద్ తెలంగాణకు వెళుతుంది కాబట్టి.. ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే ప్రత్యేక ప్యాకేజ్ ఉండాలని రాజ్యసభలో గట్టిగా నిలబడ్డారని చంద్రబాబు గుర్తు చేశారు.

గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అరుణ్ జైట్లీ ఎయిమ్స్‌ చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. న్యాయకోవిదుడిగా, పార్లమెంటెరీయన్‌గా జైట్లీ దేశప్రజలతో మన్ననలు అందుకున్నారు. కొద్దిరోజుల వ్యవధిలోనే సుష్మా స్వరాజ్, జైట్లీ వంటి అగ్రనేతలను కోల్పోవడంతో బీజేపీ శ్రేణులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

బీజేపీ కేంద్ర కార్యాలయానికి జైట్లీ పార్థీవదేహం, మధ్యాహ్నం అంత్యక్రియలు

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం

జైట్లీ భార్యాకొడుకులతో మాట్లాడిన మోడీ: మిస్సవుతున్నా...

తెలంగాణ బిల్లు: అరుణ్ జైట్లీ కీలక పాత్ర

తెలంగాణ బిల్లు: ఆ ఇద్దరు కీలక నేతల మృతి

మోడీకి ఢిల్లీ గేట్స్ తెరిచింది జైట్లీనే

జైట్లీ మృతిపై కపిల్ సిబల్ దిగ్భ్రాంతి : క్రికెట్ లో మేమిద్దరం అంటూ ఫోటోలు విడుదల