అనంతపురం: టిఫిన్ తింటున్న సమయంలోనే  వరుసగా బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడంతో  మా పక్క టేబుల్‌ వద్ద కూర్చొని టిఫిన్ చేస్తున్న వారు మృత్యువాత పడినా కూడ తాము మాత్రం సురక్షితంగా బయట పడినట్టుగా అనంతపురం వాసి సురేంద్రబాబు చెప్పారు.

శ్రీలంక రాజధాని కొలంబోలోని షంగ్రీల్లా హోటల్‌లో  ఆదివారం నాడు సురేంద్ర బాబుతో పాటు ఆయన స్నేహితులు  రాజగోపాల్, దేవినేని వెంకటేష్, మహీధర్ రెడ్డి,భక్తవత్సలంలు సురక్షితంగా బయటపడ్డారు.

నిమిషం వ్యవధిలోనే రెండు దఫాలు హోటల్‌లో బాంబు పేలుళ్లు చోటు చేసుకొన్నాయని  సురేంద్ర బాబు చెప్పారు. మంగళవారం నాడు సురేంద్ర బాబు తన స్నేహితులతో కలిసి అనంతపురానికి చేరుకొన్నాడు.  ఈ సందర్భంగా ఓ మీడియా ఛానెల్‌తో ఆయన మాట్లాడారు.

ముగ్గురం స్నేహితులం టిఫిన్ తినేందుకు హోటల్‌లో కూర్చొన్నామని.. ఇద్దరు స్నేహితులు మాత్రం రూమ్‌లోనే ఉన్నారని ఆయన గుర్తు చేసుకొన్నారు. బాంబులు పేలిన తర్వాత  తమ ఇద్దరి స్నేహితులకు ఫోన్ చేశామన్నారు. కానీ  పది నిమిషాల వ్యవధిలో అందరం కూడ కలుసుకొన్నామన్నారు.

బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత  తమ  చుట్టూ మాంసం ముద్దలు,రక్తం మరకలతో హోటల్ నిండిపోయిందన్నారు. తాము స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడినట్టుగా ఆయన వివరించారు. షంగ్రీల్లా హోటల్ సిబ్బంది నిమిషాల వ్యవధిలో తమను ఆసుపత్రిలో చేర్పించారన్నారు. ఆసుపత్రి నుండి తాజ్ హోటల్‌లో  బస కల్పించారన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, అనంతపురం జిల్లా కలెక్టర్ కూడ తమతో ఫోన్‌లో మాట్లాడారన్నారు. ఇండియన్ ఎంబసీ అధికారులు తమను కలుసుకొన్నారని  ఆయన వివరించారు.

తాజ్ హోటల్ నుండి  సెక్యూరిటీ సహాకారంతో ఎయిర్‌పోర్ట్‌కు తరలించారని ఆయన చెప్పారు. బాంబు పేలుళ్ల నుండి తామంతా సురక్షితంగా బయటపపడడం పునర్జన్మ పొందినట్టుగా ఉందని  సురేంద్ర బాబు చెప్పారు.

సంబంధిత వార్తలు

శ్రీలంకలో పేలుళ్లు: 310 మంది మృతి, 40 మంది అరెస్ట్

శ్రీలంకలో మరో పేలుడు: మరిన్ని పేలుళ్లకు కుట్ర

బాంబు పేలుళ్ల ఎఫెక్ట్: శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు

శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీ(ఎస్) కార్యకర్తల మృతి

శ్రీలంక పేలుళ్లు: టిఫిన్ కోసం క్యూలో నిలబడి.. పని ముగించిన ఉగ్రవాది

శ్రీలంకలో బాంబు పేలుళ్లు: తృటిలో తప్పించుకొన్న అనంతవాసులు

రంగంలోకి ఆర్మీ: 8 చోట్ల బాంబు దాడులతో వణుకుతున్న శ్రీలంక

శ్రీలంకలో వరుస పేలుళ్లు: ఆత్మాహుతి దాడికి పాల్పడింది వీరే

10 రోజుల ముందే హెచ్చరించినా పట్టించుకోని శ్రీలంక సర్కార్

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్‌

కొలంబోలో బాంబు పేలుళ్లు: 160 మంది మృతి, 300 మందికి గాయాలు