అనంతపురం: శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం నాడు జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ సురేంద్ర బాబు తృటిలో తప్పించుకొన్నట్టు సమాచారం.

అనంతపురం జిల్లాకు చెందిన సురేంద్రబాబు అతని నలుగురు స్నేహితులు షాంఘ్రిలా హోటల్‌లో టిఫిన్ చేస్తున్న సమయంలో బాంబు పేలినట్టుగా  సమాచారం. ఆ తర్వాత జరిగిన తోపులాటలో సురేంద్ర బాబు స్వల్పంగా గాయపడ్డారని సమాచారం. హోటల్ ఎమర్జెన్సీ గేటు నుండి  బయటకు వచ్చారని జిల్లాలో ప్రచారం సాగుతోంది.

సురేంద్రబాబుతో పాటు ఆయన స్నేహితుల ఎలా ఉన్నారనే విషయమై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సురేంద్ర బాబు ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఆరా తీస్తున్నారు. భారతప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని శ్రీలంకలో చిక్కుకొన్న వారిని స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని  పలువురు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

రంగంలోకి ఆర్మీ: 8 చోట్ల బాంబు దాడులతో వణుకుతున్న శ్రీలంక

శ్రీలంకలో వరుస పేలుళ్లు: ఆత్మాహుతి దాడికి పాల్పడింది వీరే

10 రోజుల ముందే హెచ్చరించినా పట్టించుకోని శ్రీలంక సర్కార్

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్‌

కొలంబోలో బాంబు పేలుళ్లు: 160 మంది మృతి, 300 మందికి గాయాలు