MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Holidays : ఈ వీకెండ్ రెండ్రోజులు సెలవులు... ఎందుకో తెలుసా..?

Holidays : ఈ వీకెండ్ రెండ్రోజులు సెలవులు... ఎందుకో తెలుసా..?

Weekend Holidays : ఈ నెల మార్చిలో ఇకపై వచ్చే ప్రతి వీకెండ్ లో వరుస సెలవులు రానున్నాయి. ఈవారం రెండో శనివారం… వచ్చేవారం ఉగాది, రంజాన్ పండగలు… ఆ తర్వాతివారం శ్రీరామ నవమి, మహవీర్ జయంతి సందర్భంగా సెలవులు వస్తున్నాయి. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 11 2026, 05:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ మార్చిలో సెలవులే సెలవులు..
Image Credit : Getty

ఈ మార్చిలో సెలవులే సెలవులు..

Holidays : సెలవులు... ఈ మాట వింటేచాలు స్కూల్ పిల్లలే కాదు ఉద్యోగులూ ఎగిరి గంతేస్తారు. సాధారణంగా ప్రతివారం వచ్చే సండే సెలవుకోసమే చాలామంది ఎదురుచూస్తుంటారు.. అలాంటిది వారంలో మరేదైనా సెలవు వచ్చిందో.. వారి ఆనందానికి అవధులుండవు. ఈ నెలలో ఇక ప్రతి వీకెండ్ వీరికి ఇలాంటి ఆనందమే లభించనుంది. ఈ వీకెండ్ లో వరుసగా రెండ్రోజుల సెలవులు వస్తున్నాయి... ఏరోజు ఎందుకు సెలవుందో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మార్చి 14న సెలవు..
Image Credit : Getty

మార్చి 14న సెలవు..

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రతి నెల రెండో శనివారం సెలవు ఉంటుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు ఈరోజు సెలవు ఉంటుంది... విద్యార్థులు ఈరోజు స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. 

ఇక కొన్ని అత్యవసర విభాగాలు మినహా ప్రభుత్వ ఉద్యోగులందరికీ రెండో శనివారం సెలవు ఉంటుంది. ఇలా మార్చి 14న రెండో శనివారం సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులకు అధికారిక సెలవు ఉంది.

Related Articles

Related image1
Holiday: రెండో శ‌నివారం హాలీడే ఇవ్వ‌డానికి అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?
Related image2
Holiday Depression: సెలవుల్లో వచ్చే డిప్రెషన్ ఇది, దీని లక్షణాలు భరించడం నరకంతో సమానం
35
మార్చి 15న సెలవు...
Image Credit : Getty

మార్చి 15న సెలవు...

ప్రతి ఆదివారం మాదిరిగానే ఈ సండే కూడా విద్యాసంస్థలు, ఉద్యోగులకు సెలవు ఉంటుంది. ప్రస్తుతం పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులకు చదువుల ఒత్తిడి... ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో కొందరు ఉద్యోగులపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తుండటం ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశం.

45
ఉగాది, రంజాన్ సెలవులు..
Image Credit : Getty

ఉగాది, రంజాన్ సెలవులు..

ఈ వీకెండ్ రెండ్రోజుల సెలవులు ముగుస్తాయో లేదో అలా మరికొన్ని పండగ సెలవులు ప్రారంభం అవుతాయి. మార్చి 19న (గురువారం) తెలుగు సంవత్సరాది ఉగాది పండగ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ సెలవుంది. మార్చి 20 ఒక్కరోజే స్కూళ్లు, కార్యాలయాలు నడిచేది... మళ్లీ మార్చి 21న (శనివారం) రంజాన్ సెలవు వస్తోంది. ఆ తర్వాత మార్చి 22న ఎలాగూ ఆదివారమే కాబట్టి మరో సెలవు.. ఇలా వచ్చేవారం కూడా వరుస సెలవులున్నాయి.

55
ఈ శుక్రవారం సెలవేనా..?
Image Credit : AI meta

ఈ శుక్రవారం సెలవేనా..?

తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో మార్చిలో మరికొన్ని సెలవులున్నాయి. ఇలా మార్చి 13న అంటే వచ్చే శుక్రవారం జమాతుల్ వదా సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఉంటుంది. ఈరోజు ఉద్యోగులు ముందస్తు సమాచారంతో వేతనంతో కూడిన సెలవును పొందవచ్చు. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుంది. అయితే ముస్లిం ఉద్యోగులు ఈ ఆప్షనల్ హాలిడేను పొంది జమాతుల్ వదా జరుపుకుంటారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
పండుగలు
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హిందూ పండుగలు
విద్య
ఉద్యోగాలు, కెరీర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Revanth Reddy: కేసీఆర్ కాళేశ్వరం కట్టింది అందుకే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Now Playing
కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు పడి పడి నవ్విన అధికారులు, రైతులు | Telangana Rythu Bharosa
Recommended image3
Now Playing
తవ్వే కొద్దీ గుట్టలు గా అప్పులు బయట పడుతున్నాయి | CM Revanth Reddy Launches Telangana Rythu Bharosa
Related Stories
Recommended image1
Holiday: రెండో శ‌నివారం హాలీడే ఇవ్వ‌డానికి అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?
Recommended image2
Holiday Depression: సెలవుల్లో వచ్చే డిప్రెషన్ ఇది, దీని లక్షణాలు భరించడం నరకంతో సమానం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved