Asianet News TeluguAsianet News Telugu

శ్రీలంక పేలుళ్లు: టిఫిన్ కోసం క్యూలో నిలబడి.. పని ముగించిన ఉగ్రవాది

మహ్మద్ ఆజాం మహ్మద్ అనే వ్యక్తి కూడా అందిరిలా క్యూలైన్లో నిల్చున్నాడు. భుజాన ఓ బ్యాగ్ తగిలించుకుని చేతిలో ప్లేట్ పట్టుకుని నిలబడ్డాడు. సరిగ్గా క్యూలైన్ మధ్యలోకి వచ్చానని నిర్థారించుకున్న అనంతరం ఒక్కసారిగా తనను తాను పేల్చేసుకున్నాడు.

Sri Lanka Blasts: Suicide Bomber Queued and set off the blast At Cinnamon hotel
Author
Colombo, First Published Apr 22, 2019, 11:29 AM IST

శాంతికి ప్రతీకగా చెప్పుకునే ఈస్టర్ పండుగ నాడు ఉగ్రవాదులు జరిపిన భీకర దాడులకు శ్రీలంక వణికిపోయింది. చర్చ్‌లు, హోటళ్లను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 290 మంది మరణించగా... 500 మంది గాయపడ్డారు.

రంగంలోకి దిగిన భద్రతా దళాలు మరికొన్ని చోట్ల పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబులను నిర్వీర్యం చేశారు. లేదంటే మరణాల శాతం మరింత ఎక్కువగా ఉండేది. పేలుళ్ల ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి తెచ్చారు.

బాంబు దాడి జరిగిన ప్రాంతాల్లో ఒకటైన సినామన్ హోటల్‌లో ఓ ఆత్మాహుతి సభ్యుడు తనను తాను పేల్చుకున్నట్లుగా ధ్రువీకరించారు. ఉదయం 8.30 ప్రాంతంలో వచ్చి, పోయే వారితో హోటల్ కిటకిటలాడుతోంది. దీనికి తోడు ఈస్టర్ పండుగ కావడంతో పర్యాటకుల తాకిడి ఎక్కువైంది.

అల్పాహారం కోసం టూరిస్టులు పెద్ద సంఖ్యలో క్యూకట్టారు. ఈ సమయంలో మహ్మద్ ఆజాం మహ్మద్ అనే వ్యక్తి కూడా అందిరిలా క్యూలైన్లో నిల్చున్నాడు. భుజాన ఓ బ్యాగ్ తగిలించుకుని చేతిలో ప్లేట్ పట్టుకుని నిలబడ్డాడు.

సరిగ్గా క్యూలైన్ మధ్యలోకి వచ్చానని నిర్థారించుకున్న అనంతరం ఒక్కసారిగా తనను తాను పేల్చేసుకున్నాడు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు పదుల సంఖ్యలో మృతదేహాలు, తెగిపడిన శరీర అవయవాలు, ఆర్తనాదాలతో సినామన్ హోటల్ స్మశానాన్ని తలపించింది.

తాను శ్రీలంకకు చెందిన పెద్ద వ్యాపారిగా మహ్మద్ ఆజాం లగ్జరీ గదులు బుక్ చేసుకున్నాడని హోటల్ మేనేజర్ తెలిపాడు. బిజినెస్ పని మీద కొలంబో వచ్చినట్లుగా వివరాలు చెప్పాడని తెలిపారు. కాగా.. ఇదే హోటల్‌లో ప్రముఖ సినీనటి రాధిక బస చేశారు. ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందు ఆమె హోటల్ ఖాళీ చేయడంతో రాధిక ప్రాణాలతో బయటపడ్డారు. 

శ్రీలంకలో బాంబు పేలుళ్లు: తృటిలో తప్పించుకొన్న అనంతవాసులు

రంగంలోకి ఆర్మీ: 8 చోట్ల బాంబు దాడులతో వణుకుతున్న శ్రీలంక

శ్రీలంకలో వరుస పేలుళ్లు: ఆత్మాహుతి దాడికి పాల్పడింది వీరే

10 రోజుల ముందే హెచ్చరించినా పట్టించుకోని శ్రీలంక సర్కార్

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్‌

కొలంబోలో బాంబు పేలుళ్లు: 160 మంది మృతి, 300 మందికి గాయాలు

Follow Us:
Download App:
  • android
  • ios