శ్రీలంక రాజధాని కొలంబో వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు చర్చిలలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.వారిని టార్గెట్ చేసుకుని పేలుళ్లకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలోని కొలంబోలోని సెయింట్ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా, సిన్నామన్ గ్రాండ్, కింగ్స్‌బరి హోటళ్లలో వరుస పేలుళ్లు సంభవించాయి.

ఈ ఘటనలో 290 మంది వరకు మరణించగా.. 450 మందికి పైగా గాయపడ్డారు. చర్చ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుళ్ల నేపథ్యంలో కొలంబోలో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ పేలుళ్ల ఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేశారు.