కొలంబో: శ్రీలంక రాజధానిలోని కొలంబోలో సోమవారం సాయంత్రం మరోసారి బాంబు పేలుడు చోటు చేసుకొంది.  దీంతో ఆర్మీ సంఘటన స్థలంలో గాలింపు చర్యలు చేపట్టింది. 

శ్రీలంక రాజధాని  కొలంబోలో  ఆదివారం నాడు బాంబు పేలుడు చోటు చేసుకొన్న సెయింట్ ఆంథోనీస్ చర్చి సమీపంలోనే మరోసారి బాంబు పేలుడు చోటు చేసుకొంది. 

ఇదిలా ఉంటే  కొలంబో ప్రధాన బస్‌స్టేషన్ వద్ద 87 బాంబులను  గుర్తించారు. ఈ బాంబులను  నిర్వీర్యం చేసేందుకు ఆర్మీ ప్రయత్నిస్తోంది.ఆదివారం నాడు వరుసగా చోటు చేసుకొన్న బాంబు పేలుళ్ల ఘటనలో 295 మంది మృతి చెందారు. 500 మందికి పైగా గాయపడ్డారు. 

ఆదివారం నాడు చర్చి సమీపంలోనే బాంబులు పేలాయి.  అయితే పేలకుండా చర్చి సమీపంలో మిగిలిన బాంబులు సోమవారం నాడు పేలాయా.. లేదా  తాజాగా ఉగ్ర మూకలు బాంబులు అమర్చి విధ్వంసానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

బాంబు పేలుళ్ల ఎఫెక్ట్: శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు

శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీ(ఎస్) కార్యకర్తల మృతి

శ్రీలంక పేలుళ్లు: టిఫిన్ కోసం క్యూలో నిలబడి.. పని ముగించిన ఉగ్రవాది

శ్రీలంకలో బాంబు పేలుళ్లు: తృటిలో తప్పించుకొన్న అనంతవాసులు

రంగంలోకి ఆర్మీ: 8 చోట్ల బాంబు దాడులతో వణుకుతున్న శ్రీలంక

శ్రీలంకలో వరుస పేలుళ్లు: ఆత్మాహుతి దాడికి పాల్పడింది వీరే

10 రోజుల ముందే హెచ్చరించినా పట్టించుకోని శ్రీలంక సర్కార్

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్‌

కొలంబోలో బాంబు పేలుళ్లు: 160 మంది మృతి, 300 మందికి గాయాలు