శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్
శ్రీలంకలో ఆదివారం నాడు చర్చిలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు చేసిన బాంబు దాడులకు 129 మృత్యువాత పడ్డారు. 300 మంది గాయపడ్డారు. వరుస పేలుళ్లతో శ్రీలంక ప్రభుత్వం హై అలర్ట్ విధించింది.
కొలంబో:శ్రీలంకలో ఆదివారం నాడు చర్చిలను లక్ష్యంగా చేసిన బాంబు దాడులకు 129 మృత్యువాత పడ్డారు. 300 మంది గాయపడ్డారు. వరుస పేలుళ్లతో శ్రీలంక ప్రభుత్వం హై అలర్ట్ విధించింది.
చర్చిలను లక్ష్యంగా చేసుకొని నిర్వహించిన బాంబు దాడులపై రాజపక్సే ప్రభుత్వం అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. బాంబు దాడులు జరిగిన ప్రాంతాన్ని రాజపక్సే సందర్శించారు. ఈ ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టుగా శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.
మరో వైపు ఈ వరుస బాంబు పేలుళ్లపై శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మరో వైపు ఈ ఘటనకు ఎవరూ పాల్పడ్డారనే విషయమై శ్రీలకం ప్రభుత్వం ఆరా తీస్తోంది.