వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు సిట్ సోమవారం నాడు  నోటీసులు జారీ చేసింది. 

విశాఖపట్టణం: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు సిట్ సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దాడికి సంబంధించి వివరాలను ఇవ్వాలని సిట్ జగన్ ను కోరింది.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఏడాది అక్టోబర్ 25వ తేదీన కత్తితో దాడి చేశాడు. ఈ దాడి ఘటనపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది.

అయితే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి చేసిన శ్రీనివాసరావును వారం రోజుల పాటు సిట్ అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. కానీ, సిట్ దర్యాప్తులో పూర్తి సమాచారాన్ని రాబట్టలేకపోయినట్టు సిట్ అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.

శ్రీనివాసరావుకు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాలని కూడ సిట్ యోచనలో ఉంది. అయితే ఈ దాడికి సంబంధించిన వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు సోమవారం నాడు నోటీసులు జారీ చేశారు.

ఈ దాడికి సంబంధించి తొలిసారి వాంగ్మూలం కోసం ఆసుపత్రిలో జగన్ ఉన్న సమయంలోనే సిట్ అధికారులు వచ్చారు. కానీ, జగన్ మాత్రం సిట్ కు వాంగ్మూలం ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ మేరకు రాత పూర్వకంగానే వైసీపీ నేత రామకృష్ణారెడ్డి అప్పట్లో సిట్ అధికారులకు రాసి ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఈ కేసు పరిశోధన విషయంలో సిట్ అధికారులు సోమవారం నాడు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

జగన్ చొక్కా ఇస్తేనే.. రహస్యం బయటపడుతుంది: దేవినేని

జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు

జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

చేయించి మా అమ్మపైకి నెడుతారా: దాడిపై జగన్ భావోద్వేగం

మార్చిలో నా హత్యకు బాబు ప్లాన్, అందుకే శివాజీతో అలా: జగన్

పోలవరంలో అవినీతి, అగ్రిగోల్డ్ ఆస్తులు అన్యాక్రాంతం: బాబుపై జగన్ ఫైర్

జగన్ తో నడవని వైఎస్ ఆత్మ ఏమంటోంది....

జగన్ పై పవన్ ‘మగతనం’ కామెంట్స్

జగన్‌పై దాడి కేసు: చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు