
RK Roja: జగనన్న మళ్లీ వస్తేనే మంచిరోజులు.. బాబుకి ఆ ధైర్యం లేదు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళలు ఎదిగేందుకు ఎక్కువ అవకాశం ఉందని మాజీమంత్రి ఆర్కే రోజా అన్నారు. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా పురుషులతో పాటు ఎన్నో పదవులు ఇచ్చి ప్రోత్సహించి జగన్ ను తిరిగి సీఎం చేసుకుంటేనే మళ్లీ మహిళలకు మంచి రోజులొస్తాయని ఆకాంక్షించారు. తాడేపల్లిలో జరిగిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.