న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అంశం కీలక మలుపులు తిరుగుతోంది. దశాబ్ధాల కల అయినటువంటి ప్రాజెక్టు పట్టాలెక్కుతుందనుకుంటున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారింది. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్. 

అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. రీటెండరింగ్ కు సంబంధించి కార్యచరణ సైతం సిద్ధం చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. పోలవరం ప్రాజెక్టు వివాదలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. 

రివర్స్ టెండరింగ్ అంశంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీని నివేదిక కోరింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీ శుక్రవారం తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. 12 పేజీలతో కూడిన నివేదికన కేంద్రానికి అందజేసింది. 

నివేదికలో రివర్స్ టెండరింగ్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టు ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమైందని ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న రివర్స్ టెండరింగ్ వ్యవహారం వల్ల న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేసింది.  

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల లాభాలు కంటేనష్టాలే ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో మరింత జాప్యం జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం కొనసాగితే ఆ ప్రాజెక్టు ప్రయోజనాలు కూడా ఆలస్యమవుతాయని స్పష్టం చేసింది. ఫలితంగా పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులు భారం అవుతాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టం చేసింది.  

ఈ వార్తలు కూడా చదవండి

మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటే ఎలా...చూస్తూ ఊరుకోం: జగన్ సర్కార్ పై కేంద్రం సీరియస్

విజయసాయి వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్: పోలవరంపై మోడీ రివ్యూ, జగన్ తీరుపై ఆరా

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

జైన్ షాక్: జగన్‌ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు