న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రాన్ని సంప్రదించాల్సిందేనని జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆదేశించారు. 

పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడిన గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం రివర్స్ టెండరింగ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరినితప్పుబట్టారు. ఇకపై కేంద్రానికి చెప్పిన తర్వాతే పోలవరంపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.  

డబ్బులు చెల్లించేది కేంద్రమే కాబట్టి అన్నీ చెప్పి తీరాల్సిందేనని హెచ్చరించారు. రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు గజేంద్ర సింగ్ షెకావత్. 

 ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. సమాఖ్య వ్యవస్థలో ఎవరి ఆశీస్సులు ఎవరికీ ఉండవని స్పష్టం చేశారు. రాష్ట్రం, కేంద్రం ఎవరి పని వారు చేసుకుంటూ పోవాల్సిందేనని హితవు పలికారు. 

రివర్స్ టెండరింగ్, పోలవరం ప్రాజెక్టు పరిస్థితులపై పోలవరం అథారిటీను నివేదిక కోరినట్లు తెలిపారు. నివేదిక అనంతరం పోలవరంపై తదుపరి నిర్ణయం తీసుకుంటాని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత ఉన్నంత మాత్రాన రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీలులేదని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఘాటుగా హెచ్చరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

విజయసాయి వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్: పోలవరంపై మోడీ రివ్యూ, జగన్ తీరుపై ఆరా

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

జైన్ షాక్: జగన్‌ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు