Asianet News TeluguAsianet News Telugu

చేరదీస్తున్న చంద్రబాబు: పవన్ కు ధీటుగా ఎన్టీఆర్

బాలకృష్ణ కుటుంబం యావత్తూ ఎన్టీఆర్ ను తమ వాడిగా చేసుకునేందుకు సిద్ధపడిందని అంటున్నారు. హరికృష్ణ మృతి తర్వాత ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లతో బాలకృష్ణ కలిసి భోజనం చేయడమే కాకుండా వారిద్దరితో ఆత్మీయంగా మాట్లాడారు.

NTR may play key role in TDP
Author
Amaravathi, First Published Oct 22, 2018, 12:26 PM IST

అమరావతి: హరికృష్ణ మృతి తర్వాత నందమూరి కుటుంబంలో పరిస్థితులు మారిపోయాయి. తండ్రిని కోల్పోయిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లకు బాబాయ్ బాలకృష్ణ తోడుగా నిలవడానికి సిద్ధపడ్డారు. ఎన్టీఆర్ ను తిరిగి తెలుగుదేశంలోకి తీసుకురావడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ను వచ్చే ఎన్నికల నాటికి చేరదీయడానికి టీడీపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధపడినట్లు చెబుతున్నారు. 

అందులో భాగంగానే బాలకృష్ణ కుటుంబం యావత్తూ ఎన్టీఆర్ ను తమ వాడిగా చేసుకునేందుకు సిద్ధపడిందని అంటున్నారు. హరికృష్ణ మృతి తర్వాత ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లతో బాలకృష్ణ కలిసి భోజనం చేయడమే కాకుండా వారిద్దరితో ఆత్మీయంగా మాట్లాడారు. ఆ తర్వాత అరవింద సమేత సినిమా విడుదల తర్వాత ఆ బంధాన్ని మరింతగా పెంచుకునే కార్యక్రమాలు చేపట్టారు. 

అరవింద సమేత సక్సెస్ మీట్ కు బాలకృష్ణ హాజరు కావడం బంధం బలడిందని చెప్పడానికి ప్రబల నిదర్శనమని అంటున్నారు. తనకు నచ్చకపోతే బాలకృష్ణ దేన్నీ పట్టించుకోరు. ఎన్టీఆర్ పై ఇష్టంతోనే, ఆయనను దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ కార్యక్రమానికి హాజరైనట్లు చెబుతున్నారు. దానికి ముందే బాలయ్య కూతురు, చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి అన్నయ్య ఎన్టీఆర్ కు గిఫ్ట్ పంపించారు. దానికన్నా ముందు నారా లోకేష్ ఓ ట్వీట్ ద్వారా ఎన్టీఆర్ ను అభినందించారు. తిత్లీ తుఫాను బాధితులకు అందించిన ఆర్థిక సాయానికి నారా లోకేష్ ఎన్టీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. 

ఎన్టీఆర్ ను తిరిగి దగ్గరకు తీయాలనే ఉద్దేశం వెనక చంద్రబాబు ప్లాన్ ఉందని అంటున్నారు. అందుకు రెండు కారణాలున్నాయని అంటున్నారు. ఒకటి - ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ చేత బాలకృష్ణ వేషం వేయించడం. రెండోది - వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ సేవలను తెలుగుదేశం పార్టీ కోసం వాడుకోవడం.

మొదటి విషయానికి వస్తే .... బాలకృష్ణ చిన్నప్పటి పాత్రను తొలుత ఆయన కుమారుడు మోక్షజ్ఞతో వేయిద్దామని భావించినట్లు సమాచారం. అయితే, ఆ తర్వాత మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. ఆ పాత్రను ఎన్టీఆర్ చేత చేయించాలని అనుకున్నారని వినికిడి. యువ బాలయ్య పాత్రలో ఎన్టీఆర్ సరిగ్గా ఒదిగిపోతారని, అంతే కాకుండా ఎన్టీఆర్ ఉంటే సినిమాకు మరింత ఊపు వస్తుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కల్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రను వేస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య పాత్రను ఎన్టీఆర్ చేస్తే అన్నదమ్ములుగా ఇద్దరు సరిపోతారని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

రెండో విషయానికి వస్తే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపితో తెగదెంపులు చేసుకున్న తర్వాత చంద్రబాబు ముప్పేట దాడిని ఎదుర్కుంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, బిజెపి నేతలు తెరిపి లేకుండా చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ స్థితిలో ఎన్టీఆర్ ను ప్రచారం వాడుకుంటే ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ను దూరం పెట్టి హరికృష్ణ కుటుంబాన్ని తాను విస్మరిస్తున్నట్లు వచ్చే విమర్శలను ఎదుర్కోవడం సరి కాదని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. 

తండ్రిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఎన్టీఆర్ నారా లోకేష్ కు పోటీ వస్తారని భావించడం లేదని అంటున్నారు. వరుసగా ఎన్టీఆర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లు కొడుతున్న నేపథ్యంలో ఆయన సేవలను పార్టీకి ఉపయోగించుకుంటే కలిసి వస్తుందని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ పార్టీకి ప్రచారం చేస్తే సానుభూతి కూడా కలిసి వస్తుందని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎన్టీఆర్ బాలయ్య కుటుంబానికే కాకుండా చంద్రబాబు కుటుంబానికి కూడా మరింత చేరువయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

నందమూరి కలయిక..వాళ్లకు మింగుడుపడటం లేదా..?

హీరోయిన్ పై బాలయ్య కవిత.. సోషల్ మీడియాలో విమర్శలు!

ఏ యాక్టర్ తో ఫోటో దిగలేదు.. కానీ వీరితో దిగా: జగపతిబాబు

తారక్, నేను చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: నందమూరి బాలకృష్ణ!

బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

Follow Us:
Download App:
  • android
  • ios