పెళ్లి మండపం కూలి  మంగళగిరి ఎమ్మెల్యే , వైసీపీ కీలక నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి గాయపడ్డారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఉండవల్లిలోని దేవుడు మాన్యంలో శుక్రవారం ఓ పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి మండపం సడెన్ గా కూలిపోయింది. అదే సమయంలో వధూవరులను ఆశీర్వదించేందుకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సహా పెళ్లి కుమారుడి తండ్రి, బంధువులు మండపం పైకి వచ్చారు.

Also Read సెక్షన్ 151 ఎలా ప్రయోగిస్తారు: చంద్రబాబు అరెస్ట్‌పై హైకోర్టు...

వారు అలా మండపంలో అడుగుపెట్టగానే.. ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే ఆళ్ల సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆళ్ల కుడికాలి పాదానికి తీవ్ర గాయమైంది. దీంతో ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన కాలికి పిండికట్టు వేశారు.

గాయపడిన పలువురిని కూడా స్థానికంగా ఉన్న ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే... మండపం కూలి.. ఇంత మంది గాయపడినా పెళ్లి మాత్రం ఆగకపోవడం గమనార్హం. వధూవరులు క్షేమంగా ఉండటంతో.. వేరే చోట ఏర్పాట్లు చేసి వారి పెళ్లి జరిపించడం గమనార్హం.