Asianet News TeluguAsianet News Telugu

రెండు వారాల కిందట కూడా ఆత్మహత్యకు యత్నం.. కోడెల చివరి మాటలు ఇవే...

రాజకీయం కోసం కక్షకట్టి.. వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని కుటుంబ సభ్యుల వద్ద సోమవారం ఉదయం కోడెల ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పులిలా బతికిన తాను, తలవంపులు తట్టుకోలేనని ఉదయం కూడా సన్నిహితుల వద్ద కోడెల వాపోయినట్లు సమాచారం. 

last words of kodela before committing suicide
Author
Hyderabad, First Published Sep 16, 2019, 3:09 PM IST

టీడీపీ సీనియర్ నేత , ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఆయన మృతిపట్ల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా... ఈ విషయం గురించి ఆయన ఆత్మహత్యకు ముందు తన కుటుంబసభ్యుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రాజకీయం కోసం కక్షకట్టి.. వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని కుటుంబ సభ్యుల వద్ద సోమవారం ఉదయం కోడెల ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పులిలా బతికిన తాను, తలవంపులు తట్టుకోలేనని ఉదయం కూడా సన్నిహితుల వద్ద కోడెల వాపోయినట్లు సమాచారం. 

కొన్ని రోజులుగా కోడెల తీవ్ర మానసిక వేదనతో ఉన్నారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఇదిలా ఉంటే.. రెండు వారాల కిందట కూడా కోడెల నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది.సకాలంలో కుటుంబసభ్యులు గుర్తించడంతో అప్పట్లో ముప్పు తప్పిందని సన్నిహితులు తెలిపారు.

 మానసికంగా డీలాపడి, ప్రభుత్వం చేస్తున్న వేధింపుల గురించే కుటుంబ సభ్యులతో కోడెల చివరిగా మాట్లాడినట్లు తెలిసింది. ఉదయం ఏడున్నర సమయంలో కోడెల ఉరేసుకున్నారని, బట్టలు ఆరేసే తాడుతో.. బెడ్ రూమ్‌లో ఉరేసుకున్నారని ప్రాథమిక సమాచారం.

related news

నాన్న తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు: కోడెల కూతురు విజయలక్ష్మి

కోడెల మృతి... పోస్టుమార్టం తర్వాతే చెబుతామంటున్న డీసీపీ

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

Follow Us:
Download App:
  • android
  • ios