పాఠశాల సమీపంలో కొందరు గత కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలోని ఆలూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఆలూరు పట్టణంలోని మొయిన్ స్కూల్ పక్కన గుట్టుగా వ్యభిచారం నడిపిస్తున్న ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు దాదాపు 8మందిని అరెస్ట్ చేశారు.

వారిలో ఆాలూరుకు చెందిన నలుగురు యువకులు, ఆదోనీ పట్టణానికి చెందిన ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ విషయం ఆలూరు పట్టణంలో దావనంలా వ్యాపించడంతో భారీ ఎత్తున వారిని చూసేందుకు తరలివచ్చారు. ఎస్‌ఐ శ్రీనివాసులు వారిని రహస్యంగా విచారిస్తున్నారు.

 ఆలూరు పట్టణంలో వ్యభిచారం చేస్తున్న వారిని మొదటిసారిగా అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి కేసులు నమోదు కాలేదు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యభిచారం రాకెట్‌ వెనుక సూత్రధారులు ఎవ్వరనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంకా ఇలాంటి స్థావరాలు ఉన్నాయా..? ఉంటే ఇన్నాళ్లుగా ఎందుకు వెలుగులోకి రాలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఆలూరు, ఆదోనికి చెందిన ఇద్దరు వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే తెరవెనుక విషయాలు కూడా తెలుస్తాయని ఎస్‌ఐ తెలిపారు.