ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబుకు స్పష్టత లేదని  తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. 

హైదరాబాద్: ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబుకు స్పష్టత లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు.బుధవారం నాడు ఆయన టీఆర్ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక హోదా వల్ల ఏం ఉపయోగం, హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ఉపయోగమని చంద్రబాబునాయుడు చెప్పిన విషయాలను కేసీఆర్ గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అడిగిన వారిని మూర్ఖులని చంద్రబాబునాయుడు విమర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇప్పుడేమో ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబునాయుడుకే స్పష్టత లేదన్నారు. ఆంధ్రాకు రావాలని తనను చాలా మంది అడుగుతున్నారని చెప్పారు. వంద శాతం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

సోనియా అడిగారు, నేను కాదన్నాను: గుట్టువిప్పిన కేసీఆర్

విజేతలు వారే: అప్పుడు ఆ పార్టీల నుంచి... ఇప్పుడు టీఆర్ఎస్
కేసీఆర్ ముహుర్తం వెనుక ఆంతర్యమిదే

ఏపీలో కాలు పెట్టడం ఖాయం: కేసీఆర్

ఇతర పార్టీల కీలకనేతలు మా వైపు వస్తారు: కేసీఆర్

టీఆర్ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ఎన్నిక

కేసీఆర్ ప్రమాణానికి ముహుర్తం ఇదే: ఒక్కరితోనే కొలువు