హైదరాబాద్: ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు  త్వరలోనే మా పార్టీలో చేరుతారని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెప్పారు.బుధవారం నాడు  టీఆర్ఎస్ శాసనసభపక్షనేతగా ఎన్నికైన తర్వాత  కేసీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.

రాష్ట్రంలో 95 నుండి 106 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండేదన్నారు. ఖమ్మం జిల్లాలో  తమ పార్టీ అంతర్గత విబేధాల కారణంగానే ఎక్కువ స్థానాల్లో నష్టపోయినట్టు ఆయన చెప్పారు.

శాసనసభలో తానే సీనియర్‌నని కేసీఆర్ చెప్పారు. తన తర్వాత  రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు సీనియర్‌ ఎమ్మెల్యేలని ఆయన గుర్తు చేశారు.
దేశ రాజకీయాలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఓవైసీతో చర్చించినట్టు  కేసీఆర్ చెప్పారు.

ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లే కాదు.. గెలవని వాళ్లు కూడ తనకు ముఖ్యమని  కేసీఆర్ చెప్పారు.వాళ్లతో కూడ మాట్లాడతానని చెప్పారు.ఇతర పార్టీలకు చెందిన కీలకనేతలు తమ పార్టీలో చేరుతారని కేసీఆర్ చెప్పారు.

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ఎన్నిక

కేసీఆర్ ప్రమాణానికి ముహుర్తం ఇదే: ఒక్కరితోనే కొలువు