టీఆర్ఎస్ శాసనసభపక్షనేతగా కేసీఆర్‌ ఎన్నికయ్యారు. బుధవారం నాడు  జరిగిన టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశంలో కేసీఆర్‌ను  టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నుకొన్నారు.

హైదరాబాద్:టీఆర్ఎస్ శాసనసభపక్షనేతగా కేసీఆర్‌ ఎన్నికయ్యారు. బుధవారం నాడు జరిగిన టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశంలో కేసీఆర్‌ను టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నుకొన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో88 స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. రామగుండంలో విజయం సాధించిన ఇండిపెండెంట్ అభ్యర్థి కోరుకంటి చందర్ కూడ టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు.దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 89కు చేరుకొంది.

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కేసీఆర్ స్వయంగా అభినందించారు. దేశ రాజకీయాలతో పాటు, రాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ చర్చించారు..ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ భోజనం చేశారు.. టీఆర్ఎస్ శాసనసభపక్ష నేతగా కేసీఆర్ ను ఎన్నుకొన్న లేఖను కేసీఆర్ తో కలిసి సీనియర్ ఎమ్మెల్యేలు అందించనున్నారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్ ప్రమాణానికి ముహుర్తం ఇదే: ఒక్కరితోనే కొలువు