కాంగ్రెస్ పార్టీ తనను తీవ్రంగా అవమానించిందని  కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత  టీఆర్ఎస్ ఉనికే ఉండదని కాంగ్రెస్ నేతలు అవహేళన చేశారని ఆయన గుర్తు చేశారు.


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తనను తీవ్రంగా అవమానించిందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ ఉనికే ఉండదని కాంగ్రెస్ నేతలు అవహేళన చేశారని ఆయన గుర్తు చేశారు.

బుధవారం నాడు కేసీఆర్ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ విషయాలను వెల్లడించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసైన తర్వాత తాను కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీని కలిసినట్టు కేసీఆర్ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్‌ను విలీనం చేయాలని సోనియాగాంధీ కోరారని కేసీఆర్ గుర్తు చేసుకొన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేసినా కూడ ప్రయోజనం ఉండదని చెప్పినట్టు ఆయన తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తనను చేయాలని కోరారన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకత్వం లేదని సోనియాకు చెప్పానని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతలను విశ్వసించడం లేదని సోనియాకు చెప్పినట్టు తెలిపారు. పార్టీ విషయాలపై దిగ్విజయ్‌తో చర్చించాలని సోనియా చెప్పారని తెలిపారు.

ఈ విషయాలపై తాను దిగ్విజయ్‌సింగ్‌తో చర్చిస్తే కేసీఆర్ అవమానపర్చారని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఉనికే ఉండదన్నారు. అవమానకరంగా మాట్లాడారని కేసీఆర్ గుర్తు చేసుకొన్నారు. విజయశాంతితో పాటు... అరవింద్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొన్నారన్నారు. ఒంటరిగా పోటీ చేయాలని ఆ సమయంలో తనకు సమాచారం వినతులు వచ్చినట్టు చెప్పారు. అందుకే తాము ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించినట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

విజేతలు వారే: అప్పుడు ఆ పార్టీల నుంచి... ఇప్పుడు టీఆర్ఎస్
కేసీఆర్ ముహుర్తం వెనుక ఆంతర్యమిదే

ఏపీలో కాలు పెట్టడం ఖాయం: కేసీఆర్

ఇతర పార్టీల కీలకనేతలు మా వైపు వస్తారు: కేసీఆర్

టీఆర్ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ఎన్నిక

కేసీఆర్ ప్రమాణానికి ముహుర్తం ఇదే: ఒక్కరితోనే కొలువు