సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయాణ రాజకీయాల్లో వస్తున్నారని.. ఈ నెల 26న పార్టీ లక్ష్యాలు, ఆశయాలు, అజెండా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఆయన పార్టీ పేరు ఏంటని రాజకీయ వర్గాలతో పాటు ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలో లక్ష్మీనారాయణ తన పార్టీ పేరును ‘‘జనధ్వని’’గా రిజిస్టర్ చేయించారని వార్తలు వస్తున్నాయి. సీబీఐ జేడీగా జనం నోళ్లలో నానిన ‘‘జేడీ’’ అన్న పదం కలిసొచ్చేలా.. జనధ్వని ‘‘జేడీ’’  ని పెట్టారని తెలుస్తోంది..

దానితో పాటు వందేమాతరం అనే పేరు కూడా పరిశీలనలో ఉందని లక్ష్మీనారాయణ సన్నిహితులు చెబుతున్నారు. చాలా వరకు ‘‘జేడీ’’ అన్న పేరుపైనే లక్ష్మీనారాయణ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నెల 26న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో కొత్త పార్టీని ప్రకటిస్తారని.. ఈ కార్యక్రమానికి కొంతమందికి ఆహ్వానాలు కూడా వెళ్లాయని తెలుస్తోంది.

మహారాష్ట్య క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న లక్ష్మీనారాయణ.. డిప్యూటేషన్‌పై సీబీఐ జేడీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం కలిగించిన సత్యం కంప్యూటర్స్, జగన్ అక్రమాస్తులు, గాలి జనార్థన్ రెడ్డి మైనింగ్ కేసులను ఆయన అత్యంత చాకచక్యంగా డీల్ చేసి.. నిజాయితీ గల అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజాసేవ చేసేందుకు ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవి విరమణ పొందారు.

రాజకీయాల్లోకి జేడీ లక్ష్మీనారాయణ...26న పార్టీ ప్రకటన

కేసీఆర్ పై మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం

మా పిల్లలకు వారి కులం ఏంటో తెలీకుండా పెంచాం.. లక్ష్మీనారాయణ

మాజీ జెడీ లక్ష్మీనారాయణ నోట మళ్లీ అదేమాట

జనసేనలోకి జేడీ లక్ష్మీనారాయణ .. ఆగస్ట్ 14న ముహూర్తం ?

సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ @ వ్యవసాయ శాఖ మంత్రి

అందుకే పోలీసు ఉద్యోగం వదిలేశా : మాజీ సిబిఐ జెడీ లక్ష్మీనారాయణ