Asianet News TeluguAsianet News Telugu

మా పిల్లలకు వారి కులం ఏంటో తెలీకుండా పెంచాం.. లక్ష్మీనారాయణ

వ్యక్తుల స్వార్థం మాత్రమే అసంబద్ధ సమాజానికి దారి తీసింది. ఏ మతాలవారైనా, ఏ జాతులవారైనా మానవులంతా ఒక్కటే. సుఖ, సంతోషాలతో, శాంతి తో అందరు కలసిమెలసి ఉండాలి

cbi ex jd lakshmi naryana special guest of sarvamatha shanthi program
Author
Hyderabad, First Published Aug 27, 2018, 11:34 AM IST

తన పిల్లలకు అసలు కులం అంటే ఏంటో తెలియకుండా పెంచామని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఇంటర్నేషనల్ జిల్లా హైద్రాబాద్ శనివారం రాత్రి నగరం లో సర్వమత శాంతి సింపోజియం ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీబీఐ మాజీ జేడీలక్ష్మీనారాయణ ,  గౌరవ హైకోర్ట్ జడ్జి జస్టిస్ టి. అమర్నాథ్ గౌడ్, పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సులర్ ప్రో. సత్యనారాయణ లు హాజరయ్యారు. 

‘‘వరల్డ్ పీస్ అండ్ జస్టిస్ ఇన్ అంజస్ట్ వరల్డ్ అనే థీమ్ తో ఈ సమావేశం నిర్వహించబడింది.  అసంబద్ధ సమాజాం అంటూ ఏదిలేదు. వ్యక్తుల స్వార్థం మాత్రమే అసంబద్ధ సమాజానికి దారి తీసింది. ఏ మతాలవారైనా, ఏ జాతులవారైనా మానవులంతా ఒక్కటే. సుఖ, సంతోషాలతో, శాంతి తో అందరు కలసిమెలసి ఉండాలి.’’ అని పిలుపు నిచ్చారు జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారు. 

‘‘చిన్నప్పటినుంచే నీతిశాస్త్రాలు పిల్లలకు పాఠశాలల్లో బోధించితే శాంతి మీద సింపోజియంలు చేయాల్సిన పని ఉండేది కాదన్నారు. పరమత సహనం పట్ల చిన్నారులకు చిన్నప్పటినుంచే అవగాహన కల్పించాలన్నారు. ఇతర మతాలను గౌరవిస్తేనే మన మతానికి ఇతరులు గౌరవిస్తాను.’’ జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారు. 

cbi ex jd lakshmi naryana special guest of sarvamatha shanthi program

 ‘‘మీరు అభివృద్ధిని కాంక్షించే వారైతే శాంతి అవసరం. శాంతి లేకుండా ఎలాంటి అభివృద్ధి సాధ్యం కాదు.  నాపిల్లలను వారి కులం తెలియకుండా వారిని పెంచామన్నారు. ఇతర మతలపట్ల అవగాహన పెంచుకొని అందరు ఒక కుటుంబం లాగా జీవించాలి’’ లక్ష్మీ నారాయణ 

 ప్రపంచం లో ప్రస్తుతమున్న అశాంతి, ఆందోళనలను దృష్టి లో ఉంచుకొని ఏటా అహమ్మదీయ ముస్లిం సామ్యూనిటీ ప్రపంచ వ్యాప్తంగా అంతర్ మత శాంతి సింపోజియాలను నిర్వహిస్తూవస్తోందని, ముహమ్మద్ అజ్మతుల్లాహ్ ఘోరీ , .అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఇంటర్నేషనల్ జిల్లా హైద్రాబాద్ అధ్యక్షుడు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios