Asianet News TeluguAsianet News Telugu

జనసేనలోకి జేడీ లక్ష్మీనారాయణ .. ఆగస్ట్ 14న ముహూర్తం ?

 ఆగస్ట్ 14న ముహూర్తం ?

JD lakshmi narayana in to janasena

మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ప్రజా క్షేత్రంలోకి దిగారు. పల్లెల్లో తిరుగుతూ ఉన్నారు. 
వ్యవసాయం గురించి తెలుసుకుంటున్నారు.. 

రైతులతో ముచ్చటిస్తున్నారు.. ఎందుకయ్యా అంటే వ్యవసాయ మంత్రిని అయితే ఎలా చేయాలి అని అంటూ తన రాజకీయ ఉత్సాహాన్ని చూపించారు. 

అప్పటి నుంచి ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీలోకి వెళతారు అని ప్రచారం జరిగింది. 

టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు అంటూ ఎవరికి వారు వార్తలు రాసేశారు. 

టీడీపీ వైపు వెళ్లొచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి మరీ వాయించేసింది. కానీ అసలు వాస్తవం ఇది.

మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీకి వచ్చారు. 

ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల క్రమంలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లే ఉద్దేశం లేదని ఆప్తుల దగ్గర చెప్పారు. 

పవన్ కల్యాణ్ పోరాటం నచ్చిందని.. అధికారం కోసం కాకుండా సామాజిక రాజకీయం, సామాజిక చైతన్యం కోసం వెళుతున్న దారి బాగుందని అన్నారంట. 

ఆ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారంట. 

అయితే చివరిగా మిత్రుల ఉద్దేశం కూడా తెలుసుకోవాలని ఈ విషయాన్ని వారి దగ్గర ప్రస్తావించారు.

పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలోకి వెళ్లొచ్చుకానీ.. ఎప్పుడు వెళతారు అనే ప్రశ్న కూడా వస్తుంది. దానికి కూడా సమాధానం ఇచ్చారు. 

ఆగస్ట్ 14వ తేదీన జాయిన్ కావాలని ముహూర్తం పెట్టుకున్నారంట. 

దానికి కారణం ఏంటంటే.. ఆ రోజునే జనసేన పార్టీ మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. అదే సరైన సమయం అని భావిస్తున్నారంట. 

ఈ రెండు నెలలు కూడా జనసేన పార్టీ విధానాలు, పోరాటం చూసి.. మరిన్ని వ్యూహాలతో ఆగస్ట్ 14వ తేదీన ఆ పార్టీలో అధికారికంగా ప్రవేశించాలని ఫిక్స్ అయ్యారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ.

Follow Us:
Download App:
  • android
  • ios