Asianet News TeluguAsianet News Telugu

మాజీ జెడీ లక్ష్మీనారాయణ నోట మళ్లీ అదేమాట

సేమ్ సీన్..

JD Lkshminarayana says he is not decided on political affiliation

సిబిఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ గురించి చాలా మందికి బాగా తెలుసు. ఆయన రైతులకు సేవ చేయాలన్న సంకల్పంతో ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు. ప్రస్తుతం ఆయన గ్రామాల్లో తిరుగుతూ రైతుల సమస్యలను అధ్యయనం చేస్తున్నారు.

కానీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఏ పార్టీలో చేరతారు? అన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వడంలేదు. ఈ విషయంలో ఆయన పదే పదే పాత పాట పాడుతున్నారు. తాను రాజకీయాల్లోకి వస్తాను.. రాను అన్న క్లారిటీ ఇవ్వడంలేదు. కానీ రాజకీయాల్లోకి రావడం ఖాయమే అన్నట్లుగా లీక్ లు ఇస్తున్నారు. అదెలా అంటే తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే రైతులకు ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాను అంటున్నారు. దీన్నిబట్టి ఆయన రాజకీయాల్లోకి రాకుండా వ్యవసాయ శాఖ మంత్రి కాలేరు కాబట్టి ఆయన రాజకీయ ప్రవేశం ఖాయం అంటున్నారు.

ఇక ఆయన బిజెపి వైపు అడుగులు వేస్తారా? అన్న చర్చ ఉంది. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ శిక్షణా తరగతుల్లో పాల్గొని హల్ చల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన పవన్ కళ్యాణ్ జనసేనలో జాయిన్ అయితారని కొన్నిసార్లు అంటున్నారు. కొన్నిసార్లేమో టిడిపి వైపు వెళ్లొచ్చని చెబుతున్నారు. కొందరేమో ఆయనే సొంతంగా పార్టీ నెలకొల్పుతారని కూడా అంటున్నారు. ఇప్పటివరకు ఇవన్నీ రూమర్లు జోరుగా షికారు చేస్తున్నాయి. అయితే లక్ష్మీనారాయణ వైసిపిలోకి వెళ్తారని మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా ప్రచారం జరగలేదు.

ఇక తాజాగా కసుమురు దర్గా లో సీబీసీఐడీ మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను ఏ రాజకీయ పార్టీ లో చేరను అని చెప్పారు. రైతులకు కన్నీళ్ళు తుడిచి వారి సంక్షేమ నికి  పాటు పడుతాను అని పాత ముచ్చటే మళ్లీ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios