Asianet News TeluguAsianet News Telugu

ఎవరి వ్యక్తిగత జీవితాల్లో... జగన్‌కు పవన్ కౌంటరిదే

ఎవరి వ్యక్తిగత జీవితంలో  ఏం జరిగిందో  ఎవరికి తెలుసునని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.  ఎన్ని కష్టాలు, బాధల మధ్య  సంఘటనలు జరుగుతాయో వాళ్లకు తెలుసా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

Jamasena chief Pawan Kalyan responds on Ysrcp chief Ys Jagan comments

ఏలూరు: ఎవరి వ్యక్తిగత జీవితంలో  ఏం జరిగిందో  ఎవరికి తెలుసునని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.  ఎన్ని కష్టాలు, బాధల మధ్య  సంఘటనలు జరుగుతాయో వాళ్లకు తెలుసా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

గురువారం నాడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తాను ఇతరుల మాదిరిగా ఒళ్లు బలిసి మాట్లాడబోనని ఆయన చెప్పారు.  

మహిళల రక్షణ కోసమే తాను  జనసేన పార్టీని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. అరుపులు, కేకలు కాకుండా ఓటర్లు పేర్లను నమోదు చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు సూచించారు.2019 ఎన్నికలు కీలకమని ఆయన కార్యకర్తలకు చెప్పారు.

ఖుషీ సినిమా షూటింగ్ సమయంలోనే తాను  రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని భావించినట్టు ఆయన చెప్పారు. తాను బయటకు వెళ్తే పోలీసులకు భయపడతానని చెప్పారు. తనను పోలీసులు ఆపితే కేసులు పెడతారేమోనని భయపడతానని పవన్ కళ్యాణ్ చెప్పారు.  ఒక్కరూ ఏమీ చేయలేరన్నారు. అందరం కలిస్తే సంఘటిత శక్తిగా  మారుతామన్నారు. 

నేను ఎన్ని కష్టాలు, బాధలు పడ్డానో తనకే తెలుసునని పవన్ కళ్యాణ్ చెప్పారు.  చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోనే రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. నారాలోకేష్ మాదిరిగా కంఫర్డ్ జోన్ నుండి రాజకీయాలు చేయడం లేదన్నారు.  భగత్ సింగ్ ప్రాణ త్యాగమే  తనకు స్పూర్తి అని పవన్ కళ్యాణ్ చెప్పారు. 

 

ఈ వార్తలను కూడ చదవండి:

కార్లను మాదిరిగానే భార్యలను మారుస్తాడు: పవన్‌పై జగన్‌ సంచలనం (వీడియో)

సమాధానమిస్తా: జగన్ వ్యాఖ్యలపై పవన్ స్పందన

పవన్‌ కళ్యాణ్‌పై వ్యాఖ్యల ఎఫెక్ట్: జగన్‌కు కాపునాడు హెచ్చరిక

పవన్‌ భార్యలే తేల్చుకోవాలి: జగ‌న్‌కు ఉండవల్లి కౌంటర్

దోచుకొనే నీకే అంతుంటే నాకెంతుండాలి: జగన్‌పై వపన్

పవన్‌పై అలాంటి విమర్శలా: జగన్‌పై మంత్రి పుల్లారావు

Follow Us:
Download App:
  • android
  • ios