దోచుకొనే నీకే అంతుంటే నాకెంతుండాలి: జగన్‌పై వపన్

Pawan kalyan responds on Ysrcp chief Ys Jagan comments
Highlights

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ మండిపడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలకు దిగిన జగన్ తీరుపై  ఆయన  ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మార్పులు రావాలని తాను కోరుకొంటున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఏలూరు: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ మండిపడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలకు దిగిన జగన్ తీరుపై  ఆయన  ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మార్పులు రావాలని తాను కోరుకొంటున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు.

బుధవారం నాడు ఆయన  పశ్చిమగోదావరిజిల్లాలో మీడియాతో మాట్లాడారు. మంగళవారం నాడు వైసీపీ చీఫ్  వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగాడు. ఈ విమర్శలకు  పవన్ కళ్యాణ్ ధీటుగా స్పందించారు.

బలమైన  వ్యక్తిని కాబట్టే  జగన్  తనపై వ్యక్తిగత విమర్శలు  చేస్తున్నారని పవన్ కళ్యాణ్  తిప్పికొట్టారు.సమాజంలో మార్పు కోసం  తాను  రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.  మార్పు కోసం ప్రయత్నిస్తున్న తనపై  బీజేపీ, వైఎస్ జగన్  విమర్శలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 

రాష్ట్రాన్ని దోచుకొన్న  మీకే  అంతుంటే నిజాయితీ పరుడైన  నాకెంతుండాలి అంటూ జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగం రాసింది చంద్రబాబునాయుడు,వైఎస్ జగన్ కాదని  పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
 

loader