జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలు సరైనవి కావని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.ఈ వ్యాఖ్యలను జగన్ చేసినట్టుగా తాను పత్రికల్లో చూశాననని ఆయన చెప్పారు
న్యూఢిల్లీ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలు సరైనవి కావని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.ఈ వ్యాఖ్యలను జగన్ చేసినట్టుగా తాను పత్రికల్లో చూశాననని ఆయన చెప్పారు. ఈ రకమైన వ్యాఖ్యలు రాజకీయాలను కలుషితం చేయడమేనన్నారు.
బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ నేతలుగా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఎంతమంది భార్యాలుంటే... ఆ భార్యలే తేల్చుకోంటారని... ఇతరులు ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదనేది చట్టం చెబుతోందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.
పవన్‌కళ్యాణ్ భార్యల విషయంలో జగన్ విమర్శల నేపథ్యంలో ఆయన మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ విషయంలో ఇతరుల జోక్యం పనికిరాదన్నారు. అవసరమైతే పవన్ కళ్యాణ్ మొదటి భార్య కోర్టుకు వెళ్లొచ్చన్నారు. వ్యక్తిగతంగా ఇలా విమర్శలు చేయడం తొలిసారిగా తాను భావిస్తున్నట్టు ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
ఒకవేళ గతంలో ఈ రకమైన విమర్శలు తాను ఎప్పుడూ కూడ వినలేదన్నారు. అలా విమర్శలు చేస్తే దాన్ని తప్పేనని ఆయన చెప్పారు.ఈ రకమైన వ్యక్తిగత విమర్శలు రాజకీయాలను కలుషితం చేయడమేనని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు..
ఈ రకమైన వ్యక్తిగత విమర్శలు రెండు పార్టీలకు ఆరోగ్యకరం కాదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.జగన్ పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలకు సంబంధించిన వీడియో తాను చూడలేదన్నారు. కానీ, ఈ విషయమై పత్రికల్లో వచ్చిన వార్తలను చదివినట్టు ఆయన గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు తప్పేనని చెప్పారు.
