పవన్‌ కళ్యాణ్‌పై వ్యాఖ్యల ఎఫెక్ట్: జగన్‌కు కాపునాడు హెచ్చరిక

Kapunadu president Eshwar Rao warns to Jagan over pawan comments
Highlights

పవన్‌కళ్యాణ్‌పై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను కాపునాడు తీవ్రంగా ఖండించింది.  ఈ మేరకు ఏపీ కాపునాడు అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరావు  బుధవారం నాడు ప్రకటన విడుదల చేశారు.

అమరావతి:పవన్‌కళ్యాణ్‌పై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను కాపునాడు తీవ్రంగా ఖండించింది.  ఈ మేరకు ఏపీ కాపునాడు అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరావు  బుధవారం నాడు ప్రకటన విడుదల చేశారు.

కాపుల ఆశాజ్యోతి  పవన్ కళ్యాణ్‌పై జగన్ వ్యాఖ్యలు సమర్థనీయం కావన్నారు. పవన్ వైవాహిక జీవితంపై  జగన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదా పవన్‌ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  తమ డిమాండ్ ప్రకారంగా జగన్ వ్యవహరించకపోతే  జగన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.

పవన్‌కళ్యాణ్‌కు జగన్ క్షమాపణ చెప్పకపోతే  జగన్ పాదయాత్రను  అడ్డుకొంటామని ఆయన హెచ్చరించారు.  ఏపీలోని కాపు సామాజిక వర్గం మొత్తం జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తోందని  ఆయన చెప్పారు.

జగన్ జైలు చరిత్ర అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు.  జగన్ చరిత్ర గురించి నోరు విప్పితే ఆయనకు తమకు తేడా ఉండదన్నారు. అయితే జగన్ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లడం లేదన్నారు.

loader