పవన్‌పై అలాంటి విమర్శలా: జగన్‌పై మంత్రి పుల్లారావు

First Published 25, Jul 2018, 4:16 PM IST
Ap minister Pattipati pullarao slams on Ys Jagan
Highlights

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై  వైసీపీ చీఫ్ వ్యక్తిగత విమర్శలు సరైందికాదని ఏపీ రాష్ట్ర మంత్రి పుల్లారావు హితవు పలికారు. రాజకీయంగా విమర్శలు ఉండాలి తప్ప.. వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదని  ఆయన అభిప్రాయపడ్డారు.


గుంటూరు:జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై  వైసీపీ చీఫ్ వ్యక్తిగత విమర్శలు సరైందికాదని ఏపీ రాష్ట్ర మంత్రి పుల్లారావు హితవు పలికారు. రాజకీయంగా విమర్శలు ఉండాలి తప్ప.. వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదని  ఆయన అభిప్రాయపడ్డారు.

బుధవారం నాడు  మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్‌పై చేసిన విమర్శలపై  స్పందించారు.  ప్రత్యర్ధులపై విమర్శలు రాజకీయపరంగా ఉండాలని జగన్‌నుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ నాలుగేళ్లకోసారి  భార్యలను మారుస్తాడని చేసి జగన్ పవన్ కళ్యాణ్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు.

ఈ వ్యాఖ్యలను మంత్రి పుల్లారావు  తప్పుబట్టారు. రాజకీయాల్లో విమర్శలు హుందాగా  ఉండాల్సిన అవసరం ఉందన్నారు.  ఏపీకి సీఎం కావడమే లక్ష్యంగా  రాజకీయాలు చేస్తున్నారని  ఆయన విమర్శించారు. 

ప్రజా సమస్యలపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పోరాటం చేయడం లేదన్నారు.  అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని వదులుకొన్నారని మంత్రి పుల్లారావు అభిప్రాయపడ్డారు.  ఏపీ రాష్ట్రాభివృద్ధి కోసం విపక్షాలు సహకరించాలని  ఆయన కోరారు. 

loader