సమాధానమిస్తా: జగన్ వ్యాఖ్యలపై పవన్ స్పందన

Pawan kalyan reacts on Jagan comments
Highlights

వైసీపీ  చీఫ్  వైఎస్ జగన్  తనపై  చేసిన విమర్శలకు త్వరలోనే సమాధానం చెబుతానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  ప్రకటించారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: వైసీపీ  చీఫ్  వైఎస్ జగన్  తనపై  చేసిన విమర్శలకు త్వరలోనే సమాధానం చెబుతానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  ప్రకటించారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బుధవారం నాడు  పవన్ కళ్యాణ్ వైసీపీ చీఫ్ జగన్ వ్యాఖ్యలపై స్పందించారు.  జగన్ వ్యాఖ్యలకు తాను త్వరలోనే సమాధానమిస్తానని ప్రకటించారు. తన కాలు బాగానే ఉందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

కాలు కారణంగా యాత్రను నిలిపివేయబోనని చెప్పారు. యాత్ర యధావిధిగా కొనసాగుతోందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్  పవన్ కళ్యాణ్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. 

నైతిక విలువల గురించి పవన్ కళ్యాణ్  మాట్లాడడాన్ని ఆయన ప్రస్తావించారు.  కార్లను మార్చినట్టుగా భార్యలను మార్చే పవన్ కళ్యాణ్  నుండి కూడ నేర్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని  ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ వ్యాఖ్యలపై  పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
 

loader