విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అక్టోబర్ 25వ తేదీన శ్రీనివాసరావు  అనే యువకుడు తనపై దాడికి పాల్పడడంపై  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ బుధవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని స్వీకరించిన న్యాయస్థానం విచారణను నవంబర్ 6కు వాయిదా వేసింది.

ఇదే కేసుకు సంబంధించి వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్‌తో కలిపి జగన్ పిటిషన్‌ను విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తనపై దాడి జరిగిన కొద్దిసేపటికే నిందితుడు శ్రీనివాసరావు ఫ్లెక్సీలు తీసుకురావడం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై జగన్ అనుమానాలను వ్యక్తం చేశారు.

ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా విశాఖ నార్త్‌జోన్ పోలీసులకు కేసును అప్పగించారని ఆయన అనుమానాలను వ్యక్తంచేశారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని.. తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా విచారణ సాగుతోందని... ఏపీ ప్రభుత్వానికి సంబంధంలేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ఫలించిన పోలీసుల ఎత్తు.. తల్లిదండ్రుల ముందు కొందరి పేర్లు చెప్పిన శ్రీనివాసరావు

జగన్ పై దాడి.. కీలకంగా మారనున్న జగన్ షర్ట్

మళ్లీ అనారోగ్యానికి గురైన శ్రీనివాస్...ఎయిర్ పోర్టు పీఎస్‌లోనే వైద్యం

మిస్డ్ కాల్ వస్తే ఫోన్ చేశా: జగన్‌‌పై దాడి కేసులో గుంటూరు మహిళ

దాడి జరిగిన తర్వాత జగన్ విశాఖలో ఎందుకు ఆగలేదంటే......

జగన్ స్టేట్‌మెంట్‌కోసం మరోసారి ఏపీ పోలీసుల యత్నం

సిట్ అధికారులను శ్రీనివాస్ తల్లిదండ్రులు ఏం కోరారంటే...

జగన్ పైదాడి.. నిందితుడు శ్రీనివాసరావుని చంపేందుకు కుట్ర?

దాడి కేసు విచారణపై హైకోర్టులో జగన్ పిటిషన్....ప్రతివాదిగా చంద్రబాబు

నవంబర్ 6న దాడిపై ప్రజలకు వివరణ ఇవ్వనున్న జగన్

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ