వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు... సినీనటుడు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు శివాజీ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై రోజా ఉపయోగించిన భాష చాలా దారుణంగా ఉందన్నారు..

అవసరమైతే ఆమెపై పరువు నష్టం దావా వేయగలననీ కానీ ఇప్పటికీ రోజాను గౌరవిస్తున్నానని అన్నారు. తాను మాట్లాడాలనుకుంటే రోజా కంటే నీచమైన భాషలో మాట్లాడగలనన్నారు. తాను పల్నాడు ప్రాంతానికి చెందినవాడినని.. బూతుల్లో పీహెచ్డీ ఏదైనా ఉందంటే అది మా పల్నాడుకే ఉందని శివాజీ వార్నింగ్ ఇచ్చారు.

‘‘ రోజమ్మా..దయచేసి నా జోలికి రావొద్దు.. నా వ్యక్తిగత జీవితం గురించి విమర్శిస్తే.. కచ్చితంగా పరువు నష్టం నోటీసులు పంపిస్తానన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న భయంకర పరిణామాల గురించే తాను ‘‘ ఆపరేషన్ గరుడ’’కు సంబంధించిన వీడియోను విడుదల చేశానన్నారు.

ఆ వీడియోలో బీజేపీ, వైసీపీ, జనసేనల పేర్లను ఉచ్ఛరించలేదని... ఈ వీడియోను చూసిన నేతలంతా.. ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. తనను విచారించి మొత్తం సమాచారాన్ని లాగాలని బీజేపీ, వైసీపీ నేతలు అంటున్నారని.. తన వీడియోలో తెలిసిన వివరాలన్నీ ఉంచానని.. ఇంకా ఏం కావాలని ప్రశ్నించారు.

విచారణ సంస్థలన్నీ కేంద్రప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయని.. తనపై నిరభ్యంతరంగా విచారణ జరుపుకోవచ్చన్నారు. అయితే తనను అరెస్ట్ చేసి..మూడు నెలల్లోగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీజేపీ నేత జీవీఎల్‌ను కూడా అదుపులోకి తీసుకోవాలన్నాడు శివాజీ.

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

వాంగ్మూలం ఎందుకివ్వడు.. జగన్‌పై కేసు వేస్తా: మంత్రి పితాని

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

ఆపరేషన్ గరుడలో మరో కుట్రను బయటపెట్టిన శివాజీ

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

కేంద్రంలో అంతా గుజరాతీలే, నచ్చని వాళ్లపై వేధింపులు: చంద్రబాబు