
శాంతి.. అంతులేని అవినీతి
జాబ్ లో చేరి ఆరేళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ కోట్ల రూపాయల ఆస్తులు పోగేశారు. ఓ నాయకుడి అండతో ఆస్తులు సంపాందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరేళ్లలో కోట్లకుపడగలెత్తిన ఓ అవినీతి అధికారి వ్యవహారం సంచలనం సృష్టించింది. మధ్యలో దాదాపు 20 నెలలు సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ… ఆస్తులు ఏమాత్రం తగ్గలేదు సరికదా...ఇంకా పెరిగాయి కూడా. అవినీతి నిరోధక శాఖ దృష్టికి చేరడంతో దేవాదాయశాఖలో సహాయ కమిషనర్‌గా పనిచేసిన కె. శాంతి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.