Asianet News TeluguAsianet News Telugu

మూగ, చెవుడు బాలికపై సామూహిక అత్యాచారం..

ఓ బధిర బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. తల్లిదండ్రులు పనులకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ బాలికపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

Deaf and Dum girl Gang raped in Nallajarla Mandal, andhrapradesh
Author
First Published Oct 19, 2022, 10:16 AM IST

నల్లజర్ల : బధిర బాలికపై ఒక మేజర్, ఇద్దరు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నల్లజర్లలో జరిగింది. కొవ్వూరు డిఎస్సి శ్రీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లని రాజమహేంద్రవరం జిల్లా.. నల్లజర్ల మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలిక (15)కు చెవుడు, మూగ. ఏలూరులోని డెఫ్ అండ్ డమ్ స్కూల్లో చదువుతూ దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్ళగా..  బాలిక ఇంట్లో నిద్రిస్తోంది. 

అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు, ద్వారకాతిరుమల మండలం రామశింగవరానికి చెందిన రాసమర్తి దుర్గాంజనేయులు సోమవారం మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడ్డారు. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. మధ్యాహ్నం బాలికను ఏలూరు హాస్టల్ కి తీసుకెళ్తామని త్వరగా వచ్చిన తండ్రిని చూసి నిందితులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

భార్యపై అనుమానం.. ఏడాదిన్నర కుమార్తెని బావిలో పడేసిన తండ్రి.. చివరికి...

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. స్కూలుకు వచ్చే ఆ చిన్నారిని గత రెండు నెలలుగా డ్రైవర్ రజనీకుమార్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. కాగా, తమ కుమార్తె ప్రవర్తనలో మార్పు రావడం తల్లిదండ్రులు గమనించారు. తీవ్ర మనస్థాపానికి గురైన చిన్నారి ప్రతీ చిన్న దానికి ఏడవడం మొదలుపెట్టింది. డిప్రెషన్ లోకి వెళ్లింది. దీంతో తల్లిదండ్రులు చిన్నారిని సోమవారం ప్రశ్నించారు. అలా విషయం వెలుగులోకి వచ్చింది. 

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో 4 ఏళ్ల బాలికపై ప్రిన్సిపాల్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాలిక లోయర్ కిండర్ గార్టెన్ విద్యార్థిని. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. డ్రైవర్ రజనీకుమార్ గత రెండు నెలలుగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తమ కుమార్తె ప్రవర్తనలో మార్పు రావడంతో ప్రశ్నించిన తల్లిదండ్రులు బాలిక తెలిపిన విషయాన్ని విని షాక్ అయ్యారు. వెంటనే పోలీసులను సంప్రదించారు. 

డ్రైవర్ డిజిటల్ క్లాస్ రూమ్‌లోకి వస్తూ పిల్లలను ఇబ్బంది పెట్టేవాడని, చాలా మంది పిల్లలు అతనికి భయపడుతున్నారని పోలీసులు తెలిపారు. సీనియర్ పోలీసు అధికారి జోయెల్ డేవిస్ తెలిపిన వివరాల ప్రకారం, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అమ్మాయి తల్లి మీడియాతో మాట్లాడుతూ... “నా కూతురు డిప్రెషన్‌లో ఉంది. ఎక్కువగా మాట్లాడలేకపోతోంది. ఆమె మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడింది. దీనికి కారణమైన నిందితుడిని బహిరంగంగా నగ్నంగా కొట్టాలి. ప్రిన్సిపాల్‌ని వెంటనే బర్తరఫ్ చేయాలి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

"ఆ స్కూలు మంచిదని పాఠశాలకు డొనేషన్ కూడా ఇచ్చాం. దాన్నంతా తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే ఇక మా కుమార్తెను మళ్లీ ఆ పాఠశాలకు పంపం. అది ఎంతో పేరున్న స్కూల్ కావచ్చు. కానీ ప్రిన్సిపాల్ స్వయంగా మంచిది కాదు. ఇంత జరుగుతున్నా ఆమెకు తెలియకపోవడం.. తన డ్రైవర్ చేస్తున్న పనిని పట్టించుకోకపోవడం ఏంటి? ఎలాంటి వ్యక్తులను నియమించుకున్నారు? ఇంత దారుణమైన నేరం చేయడానికి ఎవరూ సాహసించని విధంగా నిందితులకు శిక్ష పడాలి' అని ఆమె అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios