హైదరాబాద్: హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో దాడికి గురైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చికిత్స నిమిత్తం హైదరాబాదు వచ్చి ఇక్కడి ఆస్పత్రిలో చేరారు. 

దాడి జరిగిన వెంటనే జగన్ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అందుబాటు ఉండాల్సిందని, ఆయన హైదరాబాదు వెళ్లిపోతే పొరుగు రాష్ట్రంలోకి వెళ్లి ఎపి పోలీసులు ఎలా కేసును దర్యాప్తు చేస్తారని చంద్రబాబు అన్నారు. హైదరాబాదు పదేళ్ల పాటు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని ఆయన మరిచిపోయి ఉంటారు. లేదా కావాలని ఆ విషయాన్ని పక్కన పెట్టి ఉంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఉమ్మడి రాజధాని అయినందున హైదరాబాదులో కేసును దర్యాప్తు చేయడానికి ఎపి పోలీసులకు ఏ విధమైన ఆటంకం ఉండదని నిపుణులు అంటున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ప్రస్తావిస్తూ హైదరాబాదుపై తెలంగాణకు ఎంతటి హక్కు ఉందో తనకు కూడా అంతే హక్కు ఉందని అన్నారు. తనకు కూడా హైదరాబాదులో ఎసిబి ఉందని, పోలీసు వ్యవస్థ ఉందని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొన్ని సంస్థలు నవ్యాంధ్ర రాజధానికి తరలిపోయినప్పటికీ, కొన్ని శాఖలు ఇంకా హైదరాబాదు నుంచే పనిచేస్తున్నాయి. హైదరాబాదు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అని, ఆ విషయాన్ని చంద్రబాబు మరిచిపోతున్నారని వైసిపి ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. 

అంతే కాకుండా, కత్తి దాడి జరిగిన వెంటనే జగన్ పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోవడం ఆశ్చర్యం వేస్తోందని చంద్రబాబు అన్నారు. అయితే, పోలీసులు తరుచుగా మరో రాష్ట్రానికి వెళ్లి దర్యాప్తు కొనసాగించడం, నిందితులను అరెస్టు చేయడం సాధారణమైన విషయమే. ఈ విషయాన్ని కూడా చంద్రబాబు పక్కన పెట్టారు. నిజానికి, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు దర్యాప్తు చేయడానికి ఏ విధమైన ఆటంకాలు ఉండవని నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఎపి పోలీసులపై వ్యాఖ్య: జగన్ నష్టనివారణ చర్యలు

జగన్నాటకం రక్తికట్టలేదు, రాష్ట్రపతి పాలనకు కుట్ర:గంటా

నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా...అది చూసుకోండి: నిందితుడు శ్రీనివాస్

కోర్టుకు శ్రీనివాస్, 9ఫోన్ లు ఒకే సిమ్, మరోకత్తి స్వాధీనం :జగన్ కేసుపై విశాఖ సీపీ లడ్డా

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

ఆపరేషన్ గరుడ నమ్మాల్సి వస్తే శివాజీని ప్రశ్నించండి:టీడీపీకి రోజా కౌంటర్

జగన్ పై దాడి: లేఖ మడతలు పడలేదు, ఒక్కో పేజీలో ఒక్కో రాత